నిజమైన ప్రేమ మనిషిని ఏ పని చేయడానికైనా ప్రోత్సాహిస్తుందనడానికి ఇప్పుడు మనం చూడబోయే ఘటన ఉదాహరణ.. సాధారణంగా పిల్లలమీద అధికమైన ప్రేమ ఉన్న తల్లిదండ్రులు వారు అడిగిందల్లా కొనిస్తారు.. ఒక్కోసారి వారికి నచ్చిన వస్తువు దొరకకుంటే ఆప్షనల్‌గా మరో వస్తువు కొంటారు. కానీ వారికి విపరీతంగా నచ్చిన వస్తువు మీదనుండి పిల్లల దృష్టిని మాత్రం మరల్చలేరు. కానీ ఇక్కడ ఒక తండ్రి తన పిల్లాడికి నచ్చిన వస్తువు కోసం ఏడు నెలలు శ్రమించి కానుకగా అందించాడు. తన ప్రేమను నిరూపించుకున్నాడు..

 

 

అదేంటో తెలుసుకుంటే.. అరుణ్ కుమార్ పురుషోత్తమన్ అనే కేరళ యువకుడు ఇడుక్కి జిల్లా ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా విధులు నిర్వహిస్తున్నాడు.. అయితే ఇతనికి చిన్నప్పటి నుండి ఆడుకునే బొమ్మలంటే చాలా ఇష్టమట.. అయితే అరుణ్‌కు కావల్సిన బొమ్మలు ఖర్చును అతని కుటుంబం భరించలేక పోవడంతో తానే వాటిని స్వయంగా తయారు చేసుకోవడం నేర్చుకున్నాడట. అలా ఆ బొమ్మలమీది ప్రేమ ఆసక్తిగా మారడంతో తన పిల్లలు ఏదైనా కోరుకుంటే తానే స్వయంగా తయారు చేసి ఇవ్వడం ఒక అలవాటుగా మారిందట..

 

 

అలా ఇదివరకు కొన్ని బొమ్మలు తయారు చేసి వారిని ఆనందపరిచాడట.. అయితే ఇతని కొడుకు, కూతురు ఆటో కావాలని అడగ్గానే వారికోసం రీసైకిల్ చేసిన పదార్థాలను సేకరించి, ఏడు నెలల శ్రమించి ఒక చక్కని బుల్లి ఆటోను తయారు చేసి వారికిచ్చాడు.. ఆ సమయంలో వారికళ్లలో కలిగే ఆనందం అంతా ఇంతా కాదు..

 

 

ఇకపోతే పిల్లలపై ప్రేమను వ్యక్తం చేయడానికి మనం డబ్బు ఖర్చుపెట్టి అన్ని సౌకర్యాలు కల్పిస్తుంటాం. కానీ అరుణ్ తన సమయాన్ని ఖర్చు చేసి అరుదైన కానుకను ఇచ్చాడు అతని పిల్లలకు.. వారు ఏంచక్కా ఆ అటోలో కూర్చోని షికార్లు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది.. మీరు చూసి ఆనందించండి..  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: