పసిపిల్లలను చూడగానే భలేగా ముద్దొస్తారు.. ఎందుకంటే పెద్దవాళ్లలా వారికి కుట్రలు, కుతంత్రాలు తెలియవు కదా.. అమాయకమైన వారి చిరునవ్వును చూస్తూ ఎన్ని బాధలున్నా మరచిపోవచ్చూ.. వారి ఆటలు చూస్తుంటే ఎంతో మురిపెంగా అనిపిస్తుంది.. ఇక ఆ వయస్సులో అది నిప్పు, ఇది పాము అనే తేడా వారికి తెలియక ఏది దొరికితే అది పట్టుకుని దానితో ఆడుకోవడం పొరబాటున ఏదైనా జరిగితే అమాయకమైన ముఖం పెట్టి ఏడవడం పిల్లలకు అలవాటు.. కానీ ఆ సమయంలో వారిని చూసిన తల్లిదండ్రులకు మాత్రం మనస్సు అల్లాడిపోతుంది.. అందుకే పిల్లలున్న ఇంట్లో అల్లరితో పాటుగా, ఆనందం ఉంటుంది.. అదే మోతాదులో భయం కూడా ఉంటుంది..

 

 

ఇకపోతే సాధరణంగా పసిపిల్లలను ప్రతిక్షణం కనిపెడుతూ ఉండాలి లేదంటే వారు ప్రమాదాలకు ఎదురుగా వెళ్లుతుంటారు ఒక్కోసారి వారి అదృష్టం బాగుంటే ఎదురుగా వచ్చిన ప్రమాదం వారిని ఏడిపించకుండానే వెళ్లుతుంది.. ఒక్కోసారి మాత్రం కన్న వాళ్లు ఏడవ వలసిన దుస్దితి ఏర్పడుతుంది.. ఇక చాల మంది పిల్లలు బొమ్మలతో ఆడుకుంటారన్న విషయం తెలిసిందే.. అయితే ఇప్పుడు మనం చూడబోయే వీడియోలో మాత్రం ఈ చిన్నారి పాముతో ఏంచక్క ఆడుకుంటుంది.. దాని తోకను పట్టి లాగుతుంటే అది ఈ పసిదాని వైపు పడగెత్తి మాత్రం చూడటం లేదు..

 

 

అసలు ఆ పాము ఈ చిన్నారి తన యజమాని అన్నట్లుగా నన్ను ఏం చేసుకుంటే నాకేంటి నా పని నేను చూసుకుంటా అని పాకుతూ ఆ పాప నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటే.. ఏయ్ పాము నీవెక్కడికి వెళ్లుతావు నన్ను వదిలి ఇంకా నేను అలసిపోలేదు అన్నట్లుగా చిన్న చిన్న చేతులతో బుడి బుడి అడుగులు వేసుకుంటూ రబ్బర్ బొమ్మతో ఆడుకుంటున్నట్లుగా ఆడుకుంటున్న ఈ చిన్న దాన్ని చూస్తుంటే భలే ముచ్చట వేస్తుంది కదూ.. ఇక నెటిజన్స్ అయితే ఈ చిన్నారి ఆటకు ఫిదా అవుతున్నారు.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: