హలో పాఠకుల్లారా ఇప్పుడు మీకు ఒక వింత శిశువును పరిచయం చేయబోతున్నాను.. వింత శిశువు అంటే వింతగా పుట్టిన శిశువు కాదు.. ఏంటి మాకు తెలియని వింత శిశువు కూడా ఉందా అని ఆశ్చర్యపోతున్నారా.. అవును మీకు తెలుసోలేదో నాకు తెలియదు గానీ ఈ చిన్నది మాత్రం నిజంగా పెద్ద ఘటికురాలే.. ఎందుకంటే ఈ చిన్నారి వయస్సుకు తాను చెప్పే పదం సరిపోదు.. ఇక ముద్దు ముద్దు మాటలు పలకడానికి నోరుకూడా సరిగా తిరగలేని సమయంలో ఐ లవ్‌ యు అనడానికి ఎంతలా ప్రయత్నిస్తుందో చూస్తే నవ్వు ఆగదు.. భలే ముచ్చటగా అనిపిస్తుంది..

 

 

అయితే ఈ వయస్సులో అత్త, అమ్మ అని నేర్పించాలి గానీ ఈ పాప తల్లి కావచ్చూ మాట్లాడే వారు.. ఆ పాపతో  ఐ లవ్‌ యు అంటూ చెబుతుంటే, అదే మాటను తన తల్లికి ఎంత చక్కగా అప్పచెబుతుందో.. ఇక  ఐ లవ్‌ యు అంటే లవర్స్ మాత్రమే చెప్పుకునే మాట కాదు.. ఈ ప్రపంచంలో నిజంగా ఈ పదం ఒక తల్లికి తప్ప ఎవరికి చెప్పినా తక్కువే.. ఎందుకంటే తల్లి తన ప్రాణాన్ని పణంగా పెట్టి జన్మనిస్తుంది.. తన రక్తంతో పాటు, తన ఆయువుని పంచుతుంది.. నీకోసం ఎన్ని రాత్రులు నిదుర లేకుండా గడుపుతుందో తెలుసా.. ఆ విషయాన్ని నీ జీవితాంతం గుర్తుంచుకుంటే ఈ రోజు లోకంలో అమ్మలంతా అనాధల్లా మారేవారు కాదు..

 

 

ఇక ఈ చిన్నారి ముద్దు ముద్దుగా, ముద్ద ముద్దగా  ఐ లవ్‌ యు అంటూంటే ఆ మాటలు వింటున్న ప్రతి వారి మనసు ఒక సంతోషానికి లోనవుతుంది.. కాగా ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఈ బుడ్డదాని చిలకపలుకులకు ఫిదా అవుతునారట.. కాగా ఇప్పటికే తన నవ్వులతో, పలుకులతో ఫ్యాన్స్‌ను కూడా ఏర్పరచుకున్న ఈ చిన్నారి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. మీరు చూసి ఎంజాయ్ చేయండి.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: