మనం ఎన్నో పోటీలను చూస్తుంటాం.. అలా వివిధ రకాలైన పోటీల్లో పాల్గొనే వారికి కలిగే ఇబ్బందులు కూడా ఒక్కోసారి కష్టంగా అనిపిస్తాయి.. వారికి కష్టాన్ని కలిగిస్తాయి.. కానీ అవేమి లెక్క చేయకుండా అందులో కలిగే బాధలు, కష్టాలు పట్టించు కోకుండా ఆ పోటీల్లో పాల్గొంటారు.. ఒక్కోసారి జరిగే పోటీల్లో చాలా ప్రమాదకరమైన ఆటలు కూడా ఉంటాయి.. వాటి వల్ల ప్రాణాలే పోవచ్చూ. ఇలా చెప్పుకుంటే బాక్సింగ్, బుల్ ఫైట్స్, కార్, బైక్ రేస్, ఇలా ఎన్నో ఉన్నాయి.. ఇవి చూసే వారికి ఆనందాన్ని కలిగిస్తాయి.. కానీ ఆడేవారికే ఒక్కోసారి ప్రమాదాలను పరిచయం చేస్తాయి.. ఇక రన్నింగ్, సిమ్మింగ్ ఇలాంటివి కూడా ప్రాణాలకు ప్రమాద కరంగా మారుతాయి..

 

 

ఇక ఈ పోటీల్లో పాల్గొన్న వారు పొందే బహుమానం విలువ ఎంతో తెలియదు గానీ.. గెలవడానికి ముందు ఎన్ని దెబ్బలు తగిలించుకున్నా, ఎన్ని గాయాలు దేహాన్ని బాధపెడుతున్నా.. గెలిచాక వారి కళ్లల్లో కనిపించే ఆనందం వాటినన్నీంటిని మరిచేలా చేస్తుంది.. ఇక ఇప్పుడు మనం చూడబోయే వీడియోలో కూడా ఇలాంటి ఆటే ఒకటి కనిపిస్తుంది.. ఇందులో ఉన్న ఒక వ్యక్తి పెద్దగా ఉన్న కిటికి లాంటి దానిలో నుండి ఎదురుగా ఉన్న సిమ్మింగ్ ఫూల్‌ల్లోకి దూకాలి.. ఆ సిమ్మింగ్ ఫూల్ బార్డర్లో గోడలా ఒక గ్లాసు ఉంది.. దాని పై నుండి నీటిలోకి నేరుగా పడితే ఫర్వాలేదు.. కాని మిస్సైతే మూతి పగులుతుంది..

 

 

ఇదే జరిగింది ఇక్కడ.. అతను జంప్ సరిగ్గా చేయలేదో ఏమో గానీ సరిగ్గా వెళ్లి అతని ముఖం ఆ గ్లాస్‌కు గుద్దుకోగానే, అక్కడున్న గ్లాస్ ముక్కలు అవుతుంది.. అమాంతం అంత పై నుండి పడ్డాడు కాబట్టి అతనికి దెబ్బతగిలే ఉంటుంది..  ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.. ఇక ఏదైనా పని చేసే ముందు కాస్త ఆలోచించి చేయండని నెటిజన్స్ హెచ్చరిస్తున్నారు..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: