కరోనా గత కొన్ని నెలలకు ముందు మనదేశంలో ఒంటరినే.. దాని చేతులకు చిక్కకుండా అందరిని దాచిపెట్టాయి మన ప్రభుత్వాలు.. కానీ ఇప్పుడున్న పరిస్దితుల్లో కరోనా బలం, బలగం లక్షల్లో చేరింది.. ఒక నాలుగు నెలలకు ముందు విదేశాల్లో కరోనా బారిన పడిన వారి కష్టాల గురించి కధలుగా చెప్పుకున్నాం.. పాపం కరోనా వైరస్‌తో మరణించిన శవాలను కూడా పూడ్చలేని దుస్దితి కొన్ని కొన్ని దేశాల్లో నెలకొన్నదని చదువుకున్నాం.. హస్పటల్లో కరోనా రోగులను పట్టించుకునే నాధుడే లేడని విచారం వ్యక్తం చేశాం.. కానీ ఇప్పుడున్న పరిస్దితుల్లో మనదేశం గురించి, ఇక్కడ జరిగే కరోనా విపత్తు గురించి ప్రపంచ దేశాలు మాట్లాడుకునేలా చేస్తున్నాం..

 

 

ప్రభుత్వాలు కూడా ఎంత కాలం లాక్‌డౌన్ విధించి ఈ వైరస్ బారినుండి తమ ప్రజలను కాపాడుతాయి.. జీవన చక్రం నడవాలంటే పనులు జరగాలి.. పనులు జరగాలంటే జనం బయటకు వెళ్ళాలి.. కానీ తగినంత జాగ్రత్తగా ఒళ్లు దగ్గర పెట్టుకుని మసలుకుంటే ప్రాణాలు నిబడతాయి.. కానీ ఈ నిజాన్ని మరిచినట్లుగా జనం ప్రవర్తిస్తున్నారు.. ఇక కరోనా చిన్న, పెద్ద అనే వయోభేదం లేకుండా అందరిని కబళిస్తున్న విషయం తెలిసిందే.. పసివారు అనే కనికరం కూడా చూపడం లేదు.. ఈ నేపధ్యంలో ఎందరో పెద్దవారితో పాటుగా, పిల్లలు, మరీ చిన్న వారు కూడా ఈ వైరస్ బారిన పడుతున్నారు.. నిజానికి కరోనా వచ్చిన వారి కష్టాలు మాటల్లో చెప్పడానికి కూడా పదాలు సరిపోవు..

 

 

ఇక ప్రతివారి మనస్సు తడి అయ్యే ఘటన జరిగింది.. అదేమంటే ఒక చిన్నపిల్లవాడికి కరోనా వైరస్ సోకగా అతన్ని ఒక్కన్నే హస్పిటల్స్‌కు తీసుకు వెళ్ల వలసిన పరిస్దితి ఏర్పడింది.. ఈ సమయంలో ఆ పిల్లవాడిని ఏదో తప్పుచేసిన వాడిలా చూస్తూ, కనీసం ఒక్కరు కూడా సాయంగా రాకుండా దూరం దూరంగా ఉండటం చూస్తుంటే చెమర్చని కళ్లు ఉంటాయా.. నిజంగా ఆ ఘటన చాలా బాధాకరం..

 

 

అందరు ఉన్న అనాధలా ఆ పిల్లవాన్ని అలా చూస్తుంటే వారి తల్లిదండ్రుల వేదన, రోదన ప్రతివారిని కలిచి వేస్తుంది.. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.. కాబట్టి తల్లిదండ్రులు అందరు కూడా మీతో పాటుగా మీ పిల్లల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవలసిన సమయం ఇదే అని గుర్తుంచుకోండి.. ఇప్పుడు సమాజంలో తిరుగుతున్న కరోనా వైరస్ ఎప్పుడు, ఎక్కడ ఎవరిని కాటువేస్తుందో తెలియదు.. సో జాగ్రత..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: