కరోనా వల్ల లాక్‌డౌన్ అమలు చేయడం ఏంటో గానీ, ప్రతివారి జాతకాలు మారిపోయాయి.. ఒక మనుషులకే కాదు జంతువుల జీవితాల్లో కూడా చాలా మార్పులు జరిగాయి.. ఈ సమయంలో పేదవాడు ఆకలికి అలమటిస్తే ఉన్నవాడు పెరుగుతున్న పొట్టను తగ్గించుకోవడానికి నానా పాట్లుపడ్డారు.. ఇక ఇంట్లో ఉన్న మనుషులకు ఏమో గానీ పెంచుకుంటున్న జంతువులకు కూడా రెస్ట్ తీసుకోవడమంటే విరక్తి పుట్టినట్లుగా ఉంది..

 

 

ఒక మనిషి తన జీవితకాలంలో పేషెంట్ అయ్యి బెడ్ సిక్ అయితే తప్పా ఇన్ని రోజులు బయటకు వెళ్లకుండా ఉండలేడు.. అలాంటిది ఎక్కడో చైనాలో పుట్టిన ఈ వైరస్ వల్ల ప్రపంచం మొత్తం స్లీపింగ్ మోడ్‌లోకి వెళ్లిపోవడం నిజంగా ఆశ్చర్యం.. అయితే ఆ పరిస్దితి నుండి ఇప్పుడిప్పుడే ప్రజలు బయటకు వస్తున్నారు కానీ కరోనా అనే వైరస్ మనకోసం కాపలా కాస్తుందన్న విషయాన్ని చాల మంది విస్మరిస్తున్నారు.. ఇదిలా ఉండగా లాక్‌డౌన్ సమయంలో మనుషులతో పాటుగా జంతువులు కూడా వర్కవుట్స్ చేశాయన్న విషయం తెలుసా.. తెలియకుండే ఈ క్రింది వీడియోలో చూడండి.. కానీ చూసే ముందు ఒక్క మాట..

 

 

ఏమండి మనుషులేమో కరోనా భయం లేకుంటా రోడ్ల మీద పడి తెగతిరుగుళ్లు తిరుగుతుంటే, అప్పుడప్పుడు బయటకు వెళ్లే కుక్కలను మాత్రం ఒక చోట కట్టివేస్తే ఎలాగండి.. వాటికి స్వేచ్చ వద్దా.. జంతువులకు నోరు లేదు కాబట్టి మనుషులు బ్రతికి పోయారు.. లేదంటే మనుషుల కంటే ఎక్కువగా బూతులు తిట్టేవి కావచ్చూ.. ఇకపోతే కుక్కలను పెంచుకునే ప్రతివారు వాటి ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త వహిస్తారన్న విషయం తెలిసిందే.. ఇందులో భాగంగానే ఇక్కడ మనకు కనిపించే కుక్కను పెంచుకుంటున్న ఆ ఇంటి యజమాని దాని ఆరోగ్యాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడో ఈ వీడియో చూస్తే అర్ధం అవుతుంది.. అతను వర్కవుట్స్ చేయడమే కాకుండా తన శునకంతో కూడా చేపిస్తున్నాడు.. ఇక అన్ని తెలిసినట్లుగా అదికూడా ఏంచక్కా ఆ మిషిన్ పై ఎలా పరిగెత్తుతుందో చూడండి.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: