కొన్ని కంపెనీలు ఇచ్చే ఆఫర్లు కొందరి జీవితాలనే మార్చేస్తాయి. అయితే ఆ ఆఫర్ల కారణంగా వినియోగదారుల జీవితం అయి ఉండొచ్చు ఆఫర్ పెట్టిన వారి జీవితం అయి ఉండొచ్చు. ఇంకా అలానే థాయ్‌లాండ్‌కు చెందిన రెండు రెస్టారెంట్లు కూడా అద్భుతమైన అదిరిపోయిన ఆఫర్ ను ప్రకటించాయి. 

 

ఎంతో ఖరీదైన సీఫుడ్ విందును రూ.215కే అందిస్తామంటూ బంపర్ ఆఫర్ ఇచ్చాయి. ఆ బంపర్ ఆఫర్ ఏ ఈ రెస్టారెంట్ ఓనర్ల జీవితాన్ని నాశనం చేసింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 723 ఏళ్లు జైలు శిక్షను విధించింది. ఏంటి ఒక్క ఆఫర్ ఇచ్చినందుకు ఏకంగా అంత పెద్ద శిక్ష అని మీరు అనుకుంటున్నారు కదా.. అక్కడికే వస్తున్న.. 

 

థాయ్‌లాండ్‌లో అపిచార్ట్ బోవర్‌బన్‌చరక్, ప్రపాస్బోర్న్ బావోర్న్‌బాన్ అనే రెండు రెస్టారెంట్లు ఉన్నాయి. ఇంకా ఆ రెస్టారెంటులే ఎంతో ఖరీదైన సీఫుడ్ బఫెట్ అందిస్తాం అని ప్రకటించాయి. ఇంకా ఈ బఫెట్ కి కేవలం రూ.215 చెల్లిస్తే చాలు అంటూ పేర్కొన్నారు. ఇంకా కస్టమర్లు ముందుగానే వోచర్లు తీసుకోవాలి అని హోటల్ యాజమాన్యం తెలియిపింది. 

 

ఇంకా ఇది సోషల్ మీడియాలో వివిధ సైట్లలో ప్రకటించడంతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 వేల మంది ఈ వోచర్లను కొనుగోలు చేశారు. దీంతో ఆ రెండు రెస్టారెంట్ల ఓనర్లకు రూ.12.26 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక్కడి వరకు అంత బాగుంది. కానీ సీఫుడ్ బఫెట్ ఆ 20వేల మందికి పెట్టడంలో రెస్టారెంట్లు విఫలమయ్యాయి. 

 

ఎక్కువ మంది ఓచర్లు తీసుకోవడంతో ఈ ఆఫర్ వోచర్లు కొనుగులు చేసిన కస్టమర్లు కొన్ని నెలలపాటు వేచి చూడాల్సి వచ్చింది. అయితే కొద్దీ రోజుల తర్వాత యాజమాన్యం ఆఫర్ పూర్తయినట్టు ప్రకటించింది. దీంతో కస్టమర్లు వారికీ రిఫండ్ ఇవ్వాలి అని డిమాండ్ చెయ్యగా 375 మందికి మాత్రమే డబ్బులు తిరిగి ఇచ్చేశారు. 

 

ఈ విషయం తెలుసుకున్న మిగతా కస్టమర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంకా ఈ కేసు కోర్టుకు వెళ్ళగా అక్కడ న్యాయమూర్తి ఈ కేసుపై స్పందిస్తూ ఈ ఆఫర్ ను అమలు చేయలేమనే అని ముందే తెలిసినప్పటికీ ఉద్దేశపూర్వకంగానే మోసానికి పాల్పడినట్టు అయన తెలిపారు. ఇంకా అంతమందిని మోసం చేసినందుకు 1,446 ఏళ్లు శిక్ష విధిస్తున్నామని న్యాయమూర్తి తెలిపారు. 

 

అయితే నిందితులు శిక్ష తగ్గించాలి అని కోరడంతో 723 ఏళ్లుకు కుదించి రూ.44,31,645 జరిమానా చెల్లించాలని ఆదేశించారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ.. అన్ని ఏళ్ళు ఆ నిందితులు బ్రతికి ఉండరు అని తెలిసినప్పటికీ ఇలాంటి భారీ శిక్షను వేశారు. కేవలం ఇప్పుడే కాదు 2017లో కూడా ప్రజలను మోసం చేసిన వ్యక్తికి 13 వేల ఏళ్ళ జైలు శిక్ష విధించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: