చిరుత వేగాన్ని అందుకోవడం అసాధ్యమన్న విషయం తెలిసిందే.. అయితే ఆ చిరుతకు కూడా కష్టం వస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూడబోయే వీడియోలో కనిపిస్తుంది.. సామాన్యంగా కౄరమృగాలను బంధించడానికి ఉచ్చులను ఏర్పాటు చేస్తారు.. కానీ ఒక్కోసారి వాటంతట అవే ప్రమాదంలో చిక్కుకుంటాయి.. ఆ సమయంలో మనుషుల కంటపడితే కొట్టి చంపేస్తారు.. ఒకవేళ వాటి అదృష్టం బాగుంటే ప్రాణాలతో బయటపడతాయి..

 

 

ఇప్పుడు మనం చూడబోయే వీడియోలోని చిరుత అదృష్టవంతురాలే.. ఎందుకంటే అది ప్రమాదంలో పడి ప్రాణాలతో బయటపడ్దది.. అది చేసిన పని పొరపాటో, లేక గ్రహపాటునో కానీ దప్పిక వేసిన సమయంలో కనిపించిన నీటి బిందెలో తల పెట్టడం దాని దురదృష్టమే.. ఎందుకంటే దాహం తీర్చుకుందామని అనుకుని ఆ బిందెలో తన తలపెట్టగా అది కాస్త అందులో ఇరుక్కుపోవడం అది రాకపోతే నానా తంటాలు పడటం చూస్తే ఆ చిరుత పిలిల్లా మారిందని అనుకోక తప్పదు..

 

 

అలా ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయిన చిరుత సుమారు రెండు గంటల పాటు నానా తిప్పలు పడగా, చివరకు అటవీ శాఖ అధికారులు, పోలీసుల చొరవతో బయట పడింది. ఇక ఈ ఘటన రాజస్థాన్ లోని రాజ్‌సమండ్ చోటు చేసుకుంది. చిరుత ఘటనపై సమాచారమందుకున్న అధికారులు… వెంటనే సంఘటనా స్థలికి చేరుకుని ఆపరేషన్ టైగర్‌ను మొదలుపెట్టి, అందులో భాగంగా  చిరుతకి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి జాగ్రత్తగా బంధించారు.

 

 

ఆ తర్వాత నిదానంగా బిందెలో చిక్కుకున్న తలను బయటకు తీశారు.. ఒకవేళ దాని తల బిందెలో చిక్కుకోకుండా, ఆ సమయంలో దానికంట్లో ఏ జీవి పడ్డా దానికి ఆహారమే అయ్యేది.. అక్కడి ప్రజల అదృష్టం బాగుంది కాబట్టి అదే చిక్కుల్లో చిక్కుకోవడం వల్ల భయం లేకుండా దాన్ని దగ్గరగా చూడగలుగుతున్నారు.. ఇకపోతే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: