ప్రపంచంలో కార్లను నడిపే డ్రైవర్లలో వింత వింత ప్రవర్తన కలిగిన వ్యక్తులు ఉంటారన్న విషయం తెలిసిందే.. కాగా ఆ కార్లో ఓనర్లు ఉన్నప్పుడు ఒకతీరుగా, లేనప్పుడు ఒక తీరుగా వారి డ్రైవింగ్ ఉంటుంది.. అయితే ఓనర్లే డ్రైవింగ్ చేసుకుంటున్న సమయంలో ఆ కారును ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు.. అదే కొత్త కారు అయితే ప్రాణాలకంటే ఎక్కువగా భావించి దాన్ని అపురూపంగా భావిస్తారు.. ఈ విషయం అందరికి తెలిసిందే.. కాగా ఒక వ్యక్తి రూ.30 లక్షలు విలువ చేసే కొత్త కారును షోరూంలో కొన్నాడు.. దాన్నిపట్టుకుని ఒక ట్రైల్ వేద్దామని ప్రయత్నించి క్షణాల్లో ఆ కారు మూతిని పగలగొట్టాడు.. చూసేవారి మనసుకే గాయం అయినట్లుగా ఫీలవుతారు, మరీ ఆ కారు ఓనర్ పరిస్దితి ఏంటో.. ఎందుకంటే ఆ వాహనం ఖరీదు రూ.30 లక్షలు మరి..

 

 

ఇక జరిగిన విషయం అంతా ఈ క్రింది వీడియోలో చూస్తే మీకు అర్ధం అవుతుంది.. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు గానీ ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది.. ఇకపోతే ఇక్కడ కారుకొన్న వ్యక్తి కంగారు పడ్డాడో లేక, ఆనందాన్ని భరించలేక పోయాడో తెలియదు గానీ రూ.30 లక్షలు విలువగల కియా కార్నివాల్ కారును కొన్నాడు.. ఇక ఆ కారు  డెలివరీ చేసే సమయంలో ఆ షోరూమ్ ఎగ్జిక్యూటీవ్ కారు ఫీచర్స్‌ను వివరిస్తుండగానే అతడు ఒక్కసారిగా కారును స్టార్ట్ చేసి, ఎస్కలేటర్‌ను ఓ తొక్కు తొక్కాడు. అంతే కారు వేగంగా వెళ్లి గోడను ఢీకొట్టింది. లక్కీగా కారులో ఎయిర్ బ్యాక్స్ ఓపెన్ కావడంతో లోపల ఉన్నవారికి ప్రమాదం తప్పింది. గానీ కారు కొన్న వ్యక్తికి ఈ ప్రమాదం కన్నీరు పెట్టిస్తుంది..

 

 

ఎందుకంటే.. ఆ వ్యక్తి కారును కొన్న ధరతోపాటు అదనంగా మరమ్మత్తు ఖర్చులు కూడా చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. తన అద్భుతమైన డ్రైవింగ్ వల్ల క్షణాల్లొ జేబుకు పెద్ద బొక్క పెట్టుకున్న ఇతన్ని చూసి నెటిజన్స్‌కు బాధపడాలో, నవ్వాలో అర్ధం కావడం లేదట.. ఇక ఈ వీడియోను మీరు చూసి ఎంజాయ్ చేయండి..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: