మనకు అప్పుడప్పుడు కనిపించే కొన్ని కొన్ని సంఘటనలు కన్నీరు తెప్పించేలా ఉంటాయి.. మరికొన్ని మనసు మీద చెదిరిపోని ముద్ర వేస్తాయి.. ఇప్పుడు మనం చూడబోయే వీడియోలోని దృశ్యాలు అలాంటివే.. ఇక్కడ కనిపించే వీడియోలో ఆకలి గొన్న ఒక చిరుత పులి వెంటాడి ఒక కోతిని వేటాడుతుంది.. అయితే ఆ కోతి మాసం తినే సమయంలో అది అప్పుడే ఒక కోతిపిల్లకు జన్మనిస్తుంది.. ఇక ఆపిల్ల కోతిని చూచిన ఆ చిరుత దాని తల్లి కోతిని తినలేదు సరికదా తల్లిని పోగొట్టుకున్న ఆ పిల్ల కోతికి తానే రక్షణగా నిలిచింది.

 

 

అదే సమయంలో పిల్ల కోతిని తినడానికి వస్తున్న హైనా జంతువుల నుండి ఆ పిల్ల కోతిని కాపాడింది. ఈ దృశ్యాలు కౄరమృగాళ్ల ప్రవర్తించే మనుషులకు ఎంతో నీతి నేర్పుతున్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే పులి స్వభావమే కౄరత్వము. అది ఆకలి కోసమే వేటాడుతుంది. ఆసమయంలో దాని నోటికి చిక్కిన ఏ ప్రాణినీ అది అంత తేలిగ్గా వదలదు. కానీ ఆ తల్లి కోతిని చూడగానే చిన్నప్పుడు మనం చదువుకున్న ఆవు, పులి కధ గుర్తుకు వస్తుంది. అనాధగా మారిన చిన్న కోతిపిల్ల తల్లిని కోల్పోయి ఏం జరుగుతుందో తెలియని స్దితిలో దిక్కులు చూస్తుంటే.. ఆ చిరుత పులి మనసుకు ఏం అనిపించిందో తెలియదు గానీ తనలోని కౄరత్వాన్ని మసిచేసి ఆ పిల్లకోతికి సంరక్షకురాలిగా నిలిచింది.. పాపం ఈ చిరుత నోటిలో పడి మరణించిన తల్లి కోతి తనకు పుట్టిన బిడ్డను కూడా చూసుకోలేక పోయింది..

 

 

ఇక ఆ పిల్ల కోతికి తన తల్లి ఎవరో, అసలు తాను ఎవరో కూడా తెలియని పరిస్థితి.. ఇక్కడ తెలుసుకోవలసిన నీతి ఏంటి అంటే. మనుషుల మధ్య మానవత్వం మంటకలుస్తు, అయిన వాళ్లనే నిర్ధాక్షిణ్యంగా ఆస్తి కోసం, ఇంకా ఇతర కారణాలతో చంపేస్తున్నా ఈ రోజుల్లోపులి చూపించిన మంచితనాన్ని చూసి అయినా మనుషులమని బ్రతుకుతున్న మనలో ఎంతో మార్పు రావాలి.. అంతేకాదు ఈ వీడియో చూసాకైనా వాత్సల్యానికి అర్థం గ్రహించి, తాను చేసిన తప్పును ఎవరు చెప్పకుండానే సరిదిద్దుకున్న ఆ పులి ఔదార్యానికి చేతులెత్తి నమస్కరించాలి.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: