మనదగ్గర పాములు కనిపిస్తే వెంటనే స్పందించి వాటిని చంపేస్తారు ప్రజలు.. కొందరైతే పాములు పట్టేవారిని పిలిచి వారిచేత ఆ పామును పట్టించి దూరంగా వదిలేస్తారు.. అదే రోడ్దు మీద పాము కనిపిస్తే ఏం ఆలోచించకుండా ఏదో ఒక వాహనంతో దాన్ని వెంటనే తొక్కి చంపేస్తారు.. ఇక విదేశాల్లోని ప్రజలు మాత్రం వారు వెళ్లుచున్న మార్గంలో ఏవైనా జంతువులు గానీ, పాములు గానీ కనిపిస్తే నిశబ్ధంగా ఉండిపోతారు.. అవి అక్కడి నుండి వెళ్లిన తర్వాత వీరంత నెమ్మదిగా జారుకుంటారు.. ఈ మధ్యకాలంలో ఇలా కనిపించే వాటితో సెల్ఫీలు కూడా దిగితున్నారు..

 

 

ఇదిలా ఉండగా బ్రెజిల్‌లోని ఒక ప్రదేశంలో పెద్ద అనకొండ రోడ్ క్రాస్ చేస్తుండటంతో అటుగా వెళ్లుచున్న వాహనదారులు ఒక్క సారిగా ఆగిపోయారు.. ముందుగా మొదటి రోడ్దును నెమ్మదిగా క్రాస్ చేసిన ఆనకొండ, రెండో రోడ్డు ఎక్కే సరికి అటునుండి వేగంగా వస్తున్న వాహనాలు కూడా ఆపేసారు. ఆ పాము మాత్రం తనకేమి ప్రమాదం లేదన్నట్లుగా తాపీగా ఆ రెండు రోడ్లను క్రాస్ చేసి పక్కనున్న పొదల్లోకి వెళ్లిపోయింది.. ఇక ఇది ఇలా వెళ్లుచున్న సమయంలో అక్కడున్న జనంలో కొందరు దీనితో సెల్ఫీలు కూడా దిగారు.. కాగా ఈ ఆనకొండ రోడ్డు క్రాస్ చేస్తున్న సమయంలో కాస్త ట్రాఫిక్ ఆగిపోయింది.. ఈ సమయంలో ఎవరు తొందరపడలేదు.. అది వెళ్లేవరకు వేచిచూసారు..

 

 

అయితే ఆ పాము మనదగ్గర గనుక అలా వెళ్లితే దాని ప్రాణాలను క్షణాల్లో మన వారు మట్టిలో కలిపేస్తారు.. చిన్న పాములు కనిపిస్తేనే ఆగరు.. అలాంటిది అంత పెద్ద పామంటే అందులో అనకొండ అంటే మాటలు కాదు.. ఇప్పుడు మనం చూడబోయే వీడియోలో ఆ పామును చూస్తే మీకే అర్ధం అవుతుంది.. దాని ఆకారం ఎంత భయంకరంగా ఉందో.. మనం ఈ వీడియోలో చూసి ఇంతలా ఫీలవుతే అక్కడున్న వారి ఫీలింగ్ ఏంటో తెలియదు గానీ ఇంతపెద్ద పాము ఇలా దగ్గరి నుండి వెళ్లుచున్న సమయంలో చూడాలంటే మాత్రం ధైర్యం కావాలంటున్నారు నెటిజన్స్. ఇక ఈ వైరల్ వీడియోను మీరు చూసి ఎంజాయ్ చేయండి.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: