ఆటలు ఆడటానికి ఒక హద్దు ఉండాలి.. కానీ లోకంలో కొందరు ఇవేమి పట్టించు కోకుండా ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటారు ఇలా చేయడం వల్ల వారికి రిస్కు, ఎదుటి వారి ప్రాణాలకు ప్రమాదం.. అయినా గానీ ఇదేమి ఆలోచించకుండా వారి మనసును తృప్తి పరచడానికి ఎంతటి సాహాసానికి అయినా పూనుకుంటారు. ఇలాంటివి వీడియో తీసి షోషల్ మీడియాలో పోస్టు కూడా చేస్తారు..

 

 

ఇక వాటిని చూసిన మన జనం ఊరుకుంటారా అహా, ఓహో అంటూ తెగ లైకులు కొట్టేస్తారు.. అంత వరకు ఓకే కానీ ప్రమాదకరం అనిపించిన అలాంటి సాహాసాలు మాత్రం చేయాలని ప్రయత్నించవద్దు..

 

 

ఇకపోతే ఇప్పుడు మనం చూడబోయే వీడియోలో ఒక వ్యక్తి హెలికాప్టర్ లో కూర్చుని ఏనుగుతో ఆటలు ఆడుతుంటాడు.. దాని ముందు హెలికాప్టర్ ను అటూ ఇటూ కదిలిస్తూ, దానికి చిక్కకుండా తప్పించుకుంటాడు.. ఇదేమి బొమ్మ ఏనుగు కాదు.. దాని ముందు ఉన్నది హెలికాప్టర్ అని కూడా దానికి తెలియదు.. ఒకవేళ పొరబాటుగా ఏనుగు తొండంతో ఆ హెలికాప్టర్ ను కొట్టిందనికో పరిస్దితి ఏంటి..

 

 

ఏది ఏమైనా చూసే వారికి ఈ దృశ్యం వినోదాన్ని ఇస్తుంది కావచ్చూ కానీ ఆ మూగజీవి ప్రాణాలకు ప్రమాదమే.. ఆ హెలికాప్టర్ లో కూర్చున్న వారికి కూడా డేంజరే.. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయగా లైకులు కొట్టేవారు లైక్ కొడుతున్నారు, కామెంట్స్ చేసే వారు కామెంట్లు చేస్తున్నారు.. ఇక నెటిజన్స్ అయితే చివాట్లు పెడుతున్నారు..

 

 

మీ వినోదం కోసం మూగజీవాల ప్రాణాలు ఎందుకు ప్రమాదంలో పడవేస్తారని.. ప్రశ్నిస్తున్నారు.. ఇకపోతే ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది.. ఇక మీరు చూసి కాసేపు ఎంజాయ్ చేయండి..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: