మనుషుల్లో తేడాగాళ్లు ఉంటారని తెలుసు గానీ వాహనాల్లో తేడా వాహనాలు ఉంటాయని మీరెప్పుడైనా విన్నారా.. అసలు ఆ పదమే వినలేదని అంటారు.. ఎందుకంటే బండిని నడిపేది మనుషులు కాబట్టి తేడా వస్తే మనిషిలో రావాలి కానీ బండిలో తేడా, మాడా అనే బేధం ఏం ఉండదు అని అనుకుంటాం గానీ ఇప్పుడు మనం ఒక వీడియోను చూస్తే అది నిజమే అనిపిస్తుంది.. ఎందుకంటే ఇది సైకిల్ కాదు, బండి కాదు.. దీనికి లైసెన్స్, హెల్మెట్ అసలే అవసరం లేదు.. ఎంత మంది ట్రాఫిక్ పోలీసులు ఉన్నా, రోడ్డుపై ట్రాఫిక్ ఎంతున్నా ఈ బండి పై వెళ్లితే ఆపేవారు ఎవరుండరు.. అదే దీని ప్రత్యేకత..

 

 

వింటుంటే త్వరగా ఈ బండిని చూడాలని అనిపిస్తుందా.. మాకు కూడా ఇలాంటి బండి ఉంటే ఏంచక్కా పోలీసు మామల ముందు భయం లేకుండా తిరగవచ్చని స్కెచ్ వేస్తున్నారా.. ఫర్వాలేదు ఈ ఆలోచనలన్ని ఈ కొత్త మోడల్ సైకిల్ బండిని చూశాక చేయండి.. ఇకపోతే ఇప్పుడు మనం చూడబోయే వీడియోలో ఒక వ్యక్తి తన సైకిల్ లాంటి బండి పై రోడ్డు మీదుగా వెళ్లుచుండగా, అతనికి హెల్మెట్ లేదని ఆపిన పోలీసుకు ఆ బండిని చూడగానే దిమ్మ తిరిగినట్లు ఉంది.. వెంటనే నవ్వుతూ అతన్ని వెళ్లమని వెనక్కు జరిగాడు..

 

 

ఇక మరో వ్యక్తి అయితే ఈ బండి చుట్టూ కుక్కలా తిరుగుతూ ఏదో అంతరిక్షం నుండి కొత్త వాహనం వచ్చినట్లుగా ఆశ్చర్య పోతున్నాడు..మొత్తానికి నవ్వు తెప్పించేలా ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవగా దీన్ని చూసిన నెటిజన్స్ పడి పడి నవ్వుతున్నారట.. ఎందుకంటే ఈ బండిని ముందు నుండి చూస్తే అచ్చం స్కూటీలా కనిపిస్తుంది.. కోంచెం వెనక్కు వెళ్లితే ఇది స్కూటీలా ఉన్న సైకిల్.. ఇప్పుడు చెప్పండి ఇదైతే ఎంత ప్రత్యేకమైన టూవీలరో.. అందుకే దీన్ని చూసిన వారు ఈ వాహనానికి ఫిదా అవుతున్నారు.. ఇక ఈ సామాన్యుడి బండిని చూసి మీరు ఎంజాయ్ చేయండి.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: