కొన్ని రోజుల క్రితం ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ వాహనంలో వెళ్తూ నడిరోడ్డుపై శృంగారం చేస్తూ కెమెరా కి చిక్కాడు. ఈ సంఘటనకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట పెద్ద దుమారమే రేపుతోంది. ఈ శృంగార వీడియో ఐక్యరాజ్యసమితి ఉన్నతాధికారుల దృష్టికి కూడా వచ్చింది. కాగా ఈ విషయంపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేయవలసిందిగా ఆదేశించారు. అధికారిక ఐక్యరాజ్యసమితి ( ఐ.రా.స) వాహనంలో డ్యూటీ లో ఉన్న ఉద్యోగి ఇలాంటి అనైతిక కార్యకలాపాలకు పాల్పడడం సరైంది కాదని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ మండిపడ్డారు. 18 సెకండ్ల నిడివిగల ఈ వీడియోలో గర్వించదగ్గ స్థాయిలో ఉన్న ఉద్యోగి లైంగిక దుష్ప్రవర్తన చాలా అసహ్యకరమైనదని... దీనిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఐరాస ప్రతినిధి  డుజారిక్ తెలిపారు. 


ఇజ్రాయిల్ దేశంలోని టెల్ అవీవ్ కి డ్యూటీ నిమిత్తం వెళ్ళిన ఐక్యరాజ్యసమితి ఉద్యోగి కారులోనే ఒక యువతి తో కలిసి సెక్స్ చేస్తూ కనిపించాడు. అతను కారు వెనుక సీట్లో కూర్చొని రెడ్ డ్రెస్ వేసుకున్న యువతి తో శృంగారం చేయడం ప్రతి ఒక్కరికి కనిపించింది. కారు ముందు భాగం లో మరొక ఐక్య రాజ్య సమితి సభ్యులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. కార్ లో సహోద్యోగులు ఉన్నప్పటికీ ఎంచక్కా సిగ్గులేకుండా వీళ్లిద్దరు రతిక్రీడలో పాల్గొనడం అందరినీ విస్తుపోయేలా చేస్తోంది. కాగా... ఒక స్థానికుడు ఈ దృశ్యాలను చిత్రీకరించి నెట్టింట పోస్ట్ చేయగా అది క్షణాల్లోనే వైరల్ అవ్వడంతో... ఐరాస అధికారులు ఈ విషయంపై గుర్రుగా ఉన్నారు. అతి తక్కువ సమయంలో ఈ ఉద్యోగులను గుర్తించి కఠినమైన చర్యలు తీసుకుంటామని ఐరాస ఉన్నత అధికారులు తెలిపారు. 


2019 సంవత్సరంలో ఐక్య రాజ్య సమితి సభ్యులు 195 లైంగిక దాడులకు పాల్గొన్నారని, 16 మంది దోషులుగా తేలితే పదిహేను మంది సభ్యులను పోలీసులు విచారిస్తున్నట్టు బురుండిలోని ఐరాస మాజీ ఉద్యోగి హీథర్ బార్ ఈ వీడియోను చూసి చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: