లోకంలో మానవుడు ఎంతో తెలివైన వాడు అనే విషయాన్ని ఏదో ఒక ప్రయోగం ద్వారా నిరూపిస్తూనే ఉన్నాడు.. మొదటగా నిప్పును కనిపెట్టిన మానవుడు ఆ తర్వాత క్రమ క్రమంగా తన జీవన విధానంలో ఊహించనన్ని మార్పులు చేసుకుంటూ ఈనాడు అందనంత ఎత్తుకు ఎదిగాడు.. తన సౌకర్యవంతమైన జీవితం కోసం పరిస్దితులను తనకు అనుకూలంగా మార్చుకుని, ఎన్నో యంత్రాలను సృష్టించాడు.. జ్ఞానంలో తనకు సాటిలేరని నిరూపించాడు.. ఇలా అందరి కోసం లేక అనేక అవసరాల కోసం లేక భవిష్యత్ తరాల కోసం ఎన్నో ప్రయోగాలు చేసాడు, చేస్తున్నాడు..

 

 

ఏదైనా సమస్య ఉంటే దానికి వేగంగా స్పందించి ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్న మనిషి అంతే సోమరిగా తయారు అవుతున్నాడు.. అనేక రోగాలకు నిలయంగా మారుతున్నాడు.. ఇకపోతే ఇప్పుడు మనం చూడబోయే వీడియో పొలం ఉన్న ప్రతి వారికి ఉపయోగపడేలా ఉంది.. ఇక్కడ కనిపిస్తున్న వీడియోలో ఒక వ్యక్తి తనపొలంలో కలుపు ఏరడానికి నాలుగు చక్రాల బండిని తయారు చేసాడు.. ఆ బండిపై చక్కగా పడుకుని ఒక్కడే తనపని తాను చేసుకుంటున్నాడు.. ఏమాత్రం అలసట లేకుండా, నడుము నొప్పి అసలే కలుగకుండా, ఇంకా చెప్పాలంటే కాసేపు అలానే ఓ కునుకు కూడా తీయవచ్చూ.. అంతే కాదు ఎండ రాకుండా నాలుగు వైపులా నీడను కూడా ఏర్పాటు చేసుకుని తమపని తాము చేసుకోవచ్చూ..

 

 

ఇక ఈ బండిని పొలంలో ఎన్ని రకాలుగా ఉపయోగించుకో వచ్చునో రైతులకే తెలియాలి.. కాగా ఇతని ఆలోచనకు ఫిదా కాని వారుంటారా.. అందుకే ఈ వీడియో సోషల్ మీడియాలో పెట్టగానే వైరల్‌గా మారింది.. ఇది చూసిన నెటిజన్స్ అయితే కామెంట్స్ మీద కామెంట్స్ పెడుతున్నారట.. కొందరైతే పొలం ఉన్న రైతులు అప్పుడే తమ పొలంలో ఈ బండిని తయారుచేసుకుని ఉపయోగించుకోవాలనే ఆలోచనలో ఉన్నారట కూడా.. ఇక మీరు చూడండి పొలం ఉంటే మీకేమైనా ఉపయోగపడుతుందో.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: