ఈ ప్రకృతిలో మనుగడ సాగిస్తున్న ప్రతి జీవి ఒకదాని పై ఒకటి ఆధారపడి జీవించవలసిందే అన్న విషయం అందరికి తెలిసిందే.. అదీగాక మనతో పాటు ఈ భూమిపై అనేక లక్షల రకాల జీవ జాతులు తమ మనుగడ సాగిస్తున్నాయి. ఇలా సుమారుగా 350 కోట్ల ఏండ్ల నుండి ఈ జీవపరిమాణం అనేది  కొనసాగుతున్నది. ఈ క్రమంలో ప్రతి జీవి పరోక్షంగా ఒకదానికొకటి ఆధారపడి జీవిస్తూ ప్రకృతిలో ఆహ్లాదాన్ని కలిగిస్తూ వాటివాటి ధర్మాలను నిర్వహిస్తున్నాయి. తమ ఆహారాన్ని సంపాదించుకుంటున్నాయి.. ఇలా ఈ ఆహార వేటలో దేని ప్రత్యేకత దానిదే..

 

 

ఇకపోతే సాలీడు పురుగుల గురించి చెప్పుకోవలసి వస్తే ఇవి ఆహారం సమకూర్చుకోవడంలో ఒక ప్రత్యేక విధానాన్ని అవలంభిస్తాయి.. అదేమంటే ఇవి జిగురుగా ఉండే ఒక వల వంటిదాన్ని అల్లుకుని గూడులా ఏర్పరచుకుంటాయి.. దీనినే స్పైడర్ వెబ్ అంటారు.. దీనిని వాటి ఉదరము నుంచి స్రవించే పట్టు వంటి దారంతో తయారు చేస్తాయి. ఇక ఏవైనా కీటకాలు ఎగురుతూ వచ్చి, లేదా ప్రాకుతూ వచ్చి ఈ వెబ్ లో చిక్కుకున్నపుడు అవి తప్పించుకోలేవు, అప్పుడు సాలీడు ఆ కీటకాలను తినేస్తుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

 

 

ఇక ఈ వీడియో పాతదేనట కానీ, దీన్ని మరోసారి వైల్డ్‌ అట్రాక్షన్స్ ఇన్‌స్టాపేజీలో షేర్‌ చేయడంతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇకపోతే ఈ వీడియోలో తరంతుల అనే జాతికి చెందిన పెద్ద సాలీడుకు ఒక వ్యక్తి ఆహారాన్ని అందించగా అది మాటువేసి భయం గొలిపేలా తన నోటితో ఆ కీటకాన్ని అందుకుంటుంది. దీన్ని కెమెరా జూమ్ చేసి తీసారు కాబట్టి కాస్త భయంకరంగా కనిపిస్తుంది..

 

 

అయితే ఈ సాలీడు తన ఆహారాన్ని నోట కరచుకున్న విధానాన్ని చూసిన కొంతమంది నెటిజన్లు వామ్మో ఇది ఎంత భయంకరంగా ఉంది అంటూ హ్యారీపోటర్‌ అండ్‌ ది చాంబర్‌ ఆఫ్‌ సీక్రెట్స్‌లోని సన్నివేశాలు గుర్తు చేసుకుంటున్నారట. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి. 

 

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Andrew Raciti (@wildattractions) on

మరింత సమాచారం తెలుసుకోండి: