పిల్లల పెంపకం అనే పక్రియ కత్తి మీద సాములాంటిది అన్న విషయం తెలిసిందే.. అందుకే భారతదేశంలో తల్లిదండ్రులు విదేశాల్లోని పేరెంట్స్ కంటే తమ పిల్లలను చాలా జాగ్రత్తగా పెంచుతారు.. ఆ పిల్లలు పెరిగి పెద్ద వారు అయినా గానీ వారిమీద ఉన్న మమకారాన్ని చంపుకోలేరు.. కానీ విదేశాల్లో అయితే ఒక వయస్సు వచ్చిన తర్వాత దాదాపుగా ఎవరి జీవితాలు వారివే..

 

 

ఇకపోతే మనదగ్గర పసిపిల్లలను ఎంతో అపురూపంగా చూసుకుంటాం.. వారు బుడి బుడి అడుగులు వేసేటప్పుడు పొరపాటున పడిపోతే తల్లి ప్రాణం విలవిలలాడుతుంది.. అందుకే చిన్న పిల్లలకు బుద్ది జ్ఞానం వచ్చేవరకు తల్లి కంటికి రెప్పలా కాపాడుకుంటుంది.. కాని ఇప్పుడు మనం చూస్తున్న వీడియోలో పసిపిల్లలను రిస్క్‌లో పెట్టే తల్లులు కనిపిస్తారు.. ఇదంతా వారి మంచికోసమే అయినా అంత చిన్న వయస్సులో వారికి ఇస్తున్న ట్రైనింగ్ చూస్తుంటే మనవారు అయితే భయంతో బిగుసుకు పోతారు.. కానీ విదేశీ తల్లులు మాత్రం అలాంటి జంకు లేకుండా వారి పిల్లలను ఎలా సిమ్మింగ్ ఫూల్లో వదిలేస్తున్నారో ఈ వీడియోలో చూడండి..

 

 

వారికి పసి వయస్సు నుండే నీటిలో ఈత కొట్టడం నేర్పిస్తున్నారు.. ఇక్కడి వీడియోలో చూస్తే చిన్న చిన్న బుజ్జాయిలు కూడా నీటిలో ఈత కొట్టడం కోసం ఎంతలా శ్రమిస్తున్నారో చూడండి.. వారిని ఇలా సిమ్మింగ్ ఫూల్‌కు తేవడానికి ముందే ఇంటిలో ఉన్న టబ్బులో ఆ బేబీ పూర్తిగా మునిగిపోకుండా నింపిన నీటిలో పడుకోబెట్టి ట్రైనింగ్ ఇస్తారట.. ఆ తర్వాత ఇలా సిమ్మింగ్ దగ్గర అత్యంత జాగ్రత్తగా ఈదడం నేర్పిస్తారట.

 

 

ఇక మన దగ్గర అయితే పాప నీటిలో తడిస్తే జలుబుచేస్తుందని ఎక్కువ సమయం వరకు నీటిదగ్గరకు కూడా వెళ్లనివ్వరు.. అసలు పిల్లలను స్వేచ్చగా ఆడుకోనివ్వరు.. మరి వీరిలా మనవారు చేయాలంటే పై ప్రాణాలు పైనే పోతాయి.. ఆ ఈత లేకున్నా మంచిదే నా బిడ్ద నీటిలో మునిగిపోతే అయ్యో నేను తట్టుకోలేనని అంటారు సెంటిమెంట్‌ను పక్కాగా ఫాలో చేసే తల్లిదండ్రులు.. ఇక సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోను చూసి ఎంజాయ్ చేయండి కానీ తొందరపడి మీ పిల్లలతో ఇలాంటి సాహసాలు మాత్రం చేయకండి ప్లీజ్.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: