ఛీ దినమ్మ జీవితం కరోనా వల్ల జీవితంలో పడరాని కష్టాలు పడవలసి వస్తుంది.. మాస్కు కట్టుకుని ఉండలేకపోతున్నా.. ఈ మాస్కు ముఖానికి ఉంటే ఊపిరి కూడా సరిగ్గా ఆడటం లేదు.. ఇలా చాల మంది అనుకుంటున్నారు కావచ్చూ.. ఎందుకంటే బండి డ్రైవింగ్ చేసేవారు హెల్మెట్ తప్పనిసరిగ్గా ధరించాలనే నిబంధన ఎలా ఉందో అలాగే మనుషులు ఎక్కడికి వెళ్లినా తప్పని సరిగ్గా మాస్క్ ధరించవలసి వస్తుంది.. కరోనాకు ముందు రోడ్డు మీది నుండి పొగ లాంటి కాలుష్యకారకాలు ఎన్ని వెలువడుతున్నా దాదాపు చాలమంది మూతికి మాస్కు అంటే తెలియని వారిలా ప్రవర్తించే వారు. కానీ ఇప్పుడు పరిస్దితులు పూర్తిగా మారిపోయాయి..

 

 

ఇక ఈ కరోనా సమయంలో పక్షులు, జంతువులు విహరిస్తున్నంత స్వేచ్చగా మనుషులు తిరగలేకపోతున్నారు. ఇక జంతువుల వల్ల కూడా కరోనా వ్యాపిస్తున్నా వాటి మూతికి మాస్క్ కట్టే వారు ఎవరు.. అందుకే ఒక కోతి మనుషుల నుండి మాకు కూడా కరోనా సోకుతుందని భావించి తనకు అందుబాటులో దొరికిన ఒక గుడ్దతో మాస్క్ కట్టుకుంది. కాని దానికి లోకమంతా చీకటిగా కనిపించడం మొదలు పెట్టగా.. ఇదేం మాస్కురా బాబు క్షణం కట్టుకుని ఉండలేకపోతున్నా, కళ్లముందు ఎవరు కనిపించడం లేదని ఆ మాస్కును తీసివేసింది..

 

 

అయితే ఈ కోతి అతి జాగ్రత్తగా ఆలోచించి, ముఖానికి కట్టవలసిన మాస్క్‌ను తలనిండుగా చుట్టుకుంది. పాపం దానికి తెలియదుగా ఈ మాస్క్ ఎలా ధరించాలో. ఇక ఈ కోతి చేసిన చమత్కారమైన పనికి పొట్టచెక్కలైయ్యేలా నవ్వు రాకతప్పదు.. ఇకపోతే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా పోస్టు చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. అసలే కోతి, పైగా దీని చేతికి ఏదైనా దొరికితే దాంతో అది చేసే చేష్టలు విచిత్రంగా ఉంటాయి.. కాగా అలాంటి ఎన్నో విచిత్రాల్లో ఇదొక చిత్రం.. అందుకే ప్రశాంతంగా ఈ వీడియోను చూసి హాయిగా నవ్వుకోండి.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: