బాధ్యత అనేది మనుషులకు ఎంత ముఖ్యమైనదో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.. ఈ బాధ్యతను సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల నాటి కాలంలో రాజ్యాలు, నేటికాలంలో దేశాలు నాశనం అయిపోతున్నాయి.. ఉదాహరణకు ఒక యజమాని ఎంతో ప్రేమగా ఒక కుక్కను పెంచుకుంటున్నాడు.. అయితే ఆ ఇంటిలోకి కొత్తవారు వచ్చినప్పుడు అది యజమానికి మొరుగుతూ తెలియ చేయాలి అది దాని బాధ్యత.. అలా కాదని దొంగలు వచ్చినప్పుడు కూడా దానిలో ఏ స్పందన లేకుంటే, అది తన బాధ్యతను విస్మరించి ప్రవర్తిస్తుందని అర్ధం.. అప్పుడు ఆ యజమాని దాని పట్ల ప్రేమను చూపించలేడు సరికదా అదొక వ్యర్ధమైనదిగా భావించి ఇంటిలో నుండి వెలివేస్తాడు..

 

 

ఇప్పుడు చైనా కూడా తన బాధ్యతను విస్మరించి కరోనాను దేశం మీదికి వదిలింది.. అందువల్ల అది ఒక నీతిలేని దేశంగా భావిస్తున్నారు.. అయితే దానికి బాధ్యత లేదు కాబట్టి వైరస్ వ్యాప్తికి మూలకారణం అయ్యింది.. కానీ ఇప్పుడు లోకంలోని దాదాపు ప్రజలందరు కూడా ఇలాగే ప్రవర్తిస్తున్నారు.. ముఖ్యంగా కరోనా ఇంతలా వ్యాప్తి చెందుతున్నా, ఈ వైరస్‌తో మరణించిన వారి శవాలను దారుణమైన స్దితిలో చూస్తున్నా కూడా బాధ్యతరాహిత్యంగా ప్రవర్తిస్తున్న వారు లేకపోలేదు..

 

 

ఇకపోతే ఇప్పుడు మనం చూడబోయే వీడియోలో ఈ కరోనా సమయంలో మాస్క్ ఎంత అవసరమో ప్రజలకు తెలియచేస్తున్నారు.. అయితే ఇందులో కొత్త ఏముందని అనుకోకండి.. ఇలా ప్రచారం చేస్తున్న వారు శారీరక వికలాంగులు.. అందులో కొందరికి మాస్క్ ధరించడానికి చేతులు కూడా లేవు.. అయినా అవలీలగా అవి ధరించి అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తూ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారు సిగ్గుపడేలా చేస్తున్నారు..

 

 

ఇక అవిటి వారైనా, చెవిటి వారైనా, కాళ్లు చేతులు లేని వారైన ఒక కమిట్‌మెంట్‌తో జీవిస్తే చాలు.. ఇలాంటి వారిని చూసి కొందరైనా బుద్ది తెచ్చుకుంటారని ఈ వీడియో చూసిన నెటిజన్స్ అనుకుంటున్నారట.. ఇక సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియో పై మీరు ఓ లుక్కు వేయండి.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: