ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... మంచి  మాంసాహారం తిన్న తరువాత .. ఐస్ క్రీమ్ తినడం పాత రోజులు. నాన్-వేజ్‌నే ఐస్‌క్రీమ్‌లా తినేయడం వెరైటీ. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? అయితే మీరు.. రష్యాకు చెందిన మిన్స్క్ ఇన్స్టిట్యూట్ ఫర్ మీట్ అండ్ డయిరీ సంస్థ సృష్టించిన ఈ ఐస్ క్రీమ్ గురించి తప్పకుండా తెలుసుకోవల్సిందే.

ఇప్పటికే సోషల్ మీడియాలో గులాబీ రుచితో మ్యాగీ.. గులాబ్ జామూన్ వడా పావ్, ఒరియో సమోసా, చాక్లెట్ దోశ, జామూన్ పిజ్జా.. వంటి భయానకమైన వంటలు ట్రెండవ్వుతున్న సంగతి తెలిసిందే. వాటి టేస్ట్ మాట ఎలా ఉన్నా.. ఆ కాంబినేషన్లే ఆహార ప్రియులకు వికారం కలిగిస్తున్నాయి. తాజాగా ఈ మాంసం ఐస్‌క్రీమ్ కూడా ఆ జాబితాలోకే చేరేలా ఉంది.

మాంసాన్ని వేడి వేడిగా పీసులు పీసులుగా తింటేనే మజా. కానీ, ఇలా ఐస్‌క్రీమ్‌లా తింటే బాగుంటుందా? అది కూడా చల్లగా? అయితే.. ఆ దాన్ని కనిపెట్టిన పరిశోధకులు మాత్రం.. ఆ టేస్ట్ సూపర్ ఉంటుందని అంటున్నారు. గత సెప్టెంబరు నెలలో జరిగిన ‘బెలాగో 2020 ఎగ్జిబిషన్‌’లో తొలిసారిగా మీట్ ఐస్‌క్రీమ్ (ఐస్ మీట్ ) గురించి ప్రకటించి ఆశ్చర్యపరిచారు.

అప్పుడు చెప్పినట్లుగానే.. వారు ఆ ఐస్‌క్రీమ్‌ను తయారు చేసి చూపించారు. పైగా ఇందులో చక్కెర ఉండదట. నేరుగా మాంసాన్ని నమిలినప్పుడు కలిగించే టేస్టే ఇందులోనూ ఉంటుందట. అయితే, ఈ టేస్ట్ కోసం వారు అందులో నిజమైన మాంసాన్ని ఉపయోగించారా లేదా రసాయనాలతో ఆ రుచిని సృష్టించారా అనేది మాత్రం స్పష్టం చేయలేదు. దీనిపై ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా మొదలయ్యాయి. ఆ ఐస్‌క్రీమ్ తయారీని కింది వీడియోలో చూడగలరు. ఇలాంటి వైరల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... మంచి  మాంసాహారం తిన్న తరువాత .. ఐస్ క్రీమ్ తినడం పాత రోజులు. నాన్-వేజ్‌నే ఐస్‌క్రీమ్‌లా తినేయడం వెరైటీ. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? అయితే మీరు.. రష్యాకు చెందిన మిన్స్క్ ఇన్స్టిట్యూట్ ఫర్ మీట్ అండ్ డయిరీ సంస్థ సృష్టించిన ఈ ఐస్ క్రీమ్ గురించి తప్పకుండా తెలుసుకోవల్సిందే.

ఇప్పటికే సోషల్ మీడియాలో గులాబీ రుచితో మ్యాగీ.. గులాబ్ జామూన్ వడా పావ్, ఒరియో సమోసా, చాక్లెట్ దోశ, జామూన్ పిజ్జా.. వంటి భయానకమైన వంటలు ట్రెండవ్వుతున్న సంగతి తెలిసిందే. వాటి టేస్ట్ మాట ఎలా ఉన్నా.. ఆ కాంబినేషన్లే ఆహార ప్రియులకు వికారం కలిగిస్తున్నాయి. తాజాగా ఈ మాంసం ఐస్‌క్రీమ్ కూడా ఆ జాబితాలోకే చేరేలా ఉంది.

మాంసాన్ని వేడి వేడిగా పీసులు పీసులుగా తింటేనే మజా. కానీ, ఇలా ఐస్‌క్రీమ్‌లా తింటే బాగుంటుందా? అది కూడా చల్లగా? అయితే.. ఆ దాన్ని కనిపెట్టిన పరిశోధకులు మాత్రం.. ఆ టేస్ట్ సూపర్ ఉంటుందని అంటున్నారు. గత సెప్టెంబరు నెలలో జరిగిన ‘బెలాగో 2020 ఎగ్జిబిషన్‌’లో తొలిసారిగా మీట్ ఐస్‌క్రీమ్ (ఐస్ మీట్ ) గురించి ప్రకటించి ఆశ్చర్యపరిచారు.

అప్పుడు చెప్పినట్లుగానే.. వారు ఆ ఐస్‌క్రీమ్‌ను తయారు చేసి చూపించారు. పైగా ఇందులో చక్కెర ఉండదట. నేరుగా మాంసాన్ని నమిలినప్పుడు కలిగించే టేస్టే ఇందులోనూ ఉంటుందట. అయితే, ఈ టేస్ట్ కోసం వారు అందులో నిజమైన మాంసాన్ని ఉపయోగించారా లేదా రసాయనాలతో ఆ రుచిని సృష్టించారా అనేది మాత్రం స్పష్టం చేయలేదు. దీనిపై ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా మొదలయ్యాయి. ఆ ఐస్‌క్రీమ్ తయారీని కింది వీడియోలో చూడగలరు. ఇలాంటి వైరల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.

మరింత సమాచారం తెలుసుకోండి: