బాణసంచా ఫ్యాక్టరీలో పెను ప్రమాదం జరిగింది.. బాణసంచా కర్మాగారంలో లో జరిగిన చిన్నపాటి ప్రమాదం వల్ల ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే... తమిళనాడులోని విరుదునగర్ జిల్లా ఎర్రి చన్నత్తం ఏరియా లో  రాజ్యలక్ష్మి బాణసంచా కర్మాగారంలో ఈ పేలుడు సంభవించిందని పోలీసులు వెల్లడించారు.దీపావళి పండుగ సందర్భంగా దాదాపుగా 50 మంది కార్మికులు కర్మాగారంలో ఎక్కడికక్కడ బాణసంచా కు సంబంధించిన పేలుడు సామాగ్రితో తమ పనిలో నిమగ్నమై ఉండగా ఒక వ్యక్తి పొరపాటున బాణసంచా కు సంబంధించి మందుకు రాపిడి కలగడంతో  ఒక్కసారిగా మంటలు చెలరేగడం వల్ల ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగింది. దీంతో వెంటనే అక్కడ ఉన్నవారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా వెంటనే వారు అక్కడికి వచ్చారు.సమాచారం అందుకున్న వెంటనే నాలుగు ఫైరింజన్స్ అక్కడి చేరుకున్నాయి. చాలాసేపు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడంలో చెమటోడ్చి చారు. రెండు గంటల పాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలస్తోంది. ప్రమాదంం జరిగి వెంటనే బాణాసచా ఫ్యాక్టరీ యొక్కన యజమాని అక్కడి నుండి పారిపోయాడు.ఫ్యాక్టరీ ఓనర్‌పై కేసు నమోదు చేసి అతడి కోసం గాలిస్తున్నారు పోలీసులు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకోవడం వల్ల ఎంతోమంది ప్రాణాలు దక్కించుకో గలిగారు లేకపోతే ప్రాణ నష్టాన్ని అంచనా వేయడానికి కూడా ఆలోచన ఉండేది కాదు. బాణాసంచా ఫ్యాక్టరీ కి సంబంధించిన యజమాని వెంటనే అక్కడి నుండి పారిపోవడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: