ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ వైరల్ న్యూస్ చదవండి... అప్పడం మన దేశ సాంప్రదాయ ఆహార పదార్ధం. ముఖ్యంగా దక్షిణ భారతదేశ సాంప్రదాయ వంటకాలలో అప్పడం ఉండాల్సిందే. అంత అనుబంధం వుంది మనకు అప్పడంతో. ఇక పోతే అసలు విషయానికి వస్తే  అప్పడాల గురించి మనం ఎన్నో ప్రకటనలు చూశాం. కానీ, ఇలాంటి ప్రకటన ఎప్పుడు చూసి ఉండరు. ఈ అప్పడం ప్రకటనలోని ఈ పాటలో మొత్తం మీకు ‘అప్పడం’ (పాపడం) అనే మాటే వినిపిస్తుంది. భారతీయుల్లా దుస్తులు ధరించిన ఆస్ట్రేలియన్లు అప్పడాలు పట్టుకుని.. డ్యాన్స్ చేయడం చూస్తే చాలా ఫన్నీగా అనిపిస్తుంది. అయితే, ఈ ప్రకటన ఎవరి కోసం.. ఎందుకు చేశారో తెలీదుగానీ.. సోషల్ మీడియాకు మాత్రం భలే నచ్చేసింది. ఎందుకంటే.. ఈ పాటలో అప్పడం తప్పా మరేదీ వినిపించదు.

ఈ వీడియో సాంగ్ వైరల్ కావడంతో.. ఆంథోనీ ఫీల్డ్ అనే వ్యక్తి స్పందించాడు. ‘‘ఈ పాటను రాసింది, డైరెక్ట్ చేసింది నేనే. దీన్ని 2014లో చిత్రీకరించాను. ఓ సెలబ్రేషన్ కోసం దీన్ని చిత్రీకరించాం. భారత సంస్కృతిని కించపరిచే ఉద్దేశంతో దీన్ని చేయలేదు. ఎవరినైనా నొప్పించి ఉంటే.. క్షమించండి’’ అని ఆయన పేర్కొన్నారు.

ఈ విషయాన్ని పక్కన పెడితే.. ఆ పాటలో ఉన్న భారతీయ మహిళ.. చివరికి వరకు పళ్లు ఇకిలిస్తూనే ఉండటం ఈ పాటకు మరో హైలెట్. దీంతో అంతా ఆమెను ట్రోల్ చేస్తున్నారు. మొదటి నుంచి చివరి వరకు ఆమె ఎక్స్‌ప్రెషన్ మార్చకుండా.. టూత్ పేస్ట్ యాడ్‌లా దంతాలు చూపిస్తూనే ఉందని అంటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఆ పాటను ఈ కింది ట్వీట్లో చూసేయండి. దీనిపై నెటిజనుల స్పందనను కూడా చూసేయండి.





మరింత సమాచారం తెలుసుకోండి: