ఎక్కడ ఉంది?పాకిస్థాన్ లోని రావి నది ఒడ్డున ఈ కర్తాపూర్ సాహిబ్ ఉంది. భారతదేశంలోని పంజాబ్ నుండి పాకిస్థాన్ లోని కర్తార్ పూర్ గురుద్వారా వరకు కలిగిఉన్న మార్గమే కర్తార్ పూర్ కారిడార్..

ప్రత్యేకత ఏమిటి?
పాకిస్తాన్ లో ఉన్న ఏకైక భారత గురుద్వారా ఇదే ప్రత్యేకత. విభజన కాలంలో ఈ ప్రాంతం పాక్ భూభాగంలో కలిసి పోయింది. దీంతో ఈ గురుద్వారా కి సిక్కులు అతి కష్టం మీద రాకపోకలను సాగించేవారు.. పాకిస్థాన్ లో ఉన్నా కూడా భారతీయ సిక్కులు ఈ కర్తార్పూర్ సాహిబ్ కి రావడం వెనక ముఖ్య కారణం ఏంటంటే సిక్కు మత గురువు అయిన గురునానక్ ఇక్కడే తన జీవితంలోని చివరి 18 ఏళ్ళు గడిపారు. మరియు ఈ ప్రాంతంలోనే పరమపదించారు. అందుకే భారత సిక్కులు ఈ ప్రాంతాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు . ఇదొక్కటి చాలు కదా ఇంకేమీ ప్రత్యేకతలు కావాలి....

కారిడార్ నిర్మాణం :
ఇరు దేశాలైన భారత్ మరియు పాకిస్తాన్ కర్తార్ పూర్ కారిడార్ ని 2019 వ సంవత్సరం  నవంబర్ 9వ తేదీన ప్రారంభించారు. మొదట భారత భూభాగంలో నవంబర్ 26, 2018 సంవత్సరంలో భారత ఉపరాష్ట్రపతి మరియు పంజాబ్ సీఎం ఈ కర్తార్ పూర్ కారిడార్ కు శంకుస్థాపన చేశారు.. సరిగ్గా సంవత్సరం తర్వాత పాకిస్తాన్ ప్రదాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ స్వయంగా తన చేతుల మీదుగా  కర్తార్పూర్ సాహిబ్ ని ప్రారంబించారు. అలా పంజాబ్ లోని డేరా బాబా నానక్ నుండి అంతర్జాతీయ సరిహద్దు వరకు భారత్ నిర్మాణాన్ని పూర్తిచేసింది..  ఆ తర్వాత సరిహద్దు నుండి  కర్తార్ పూర్ గురుద్వారా వరకు అనుకున్న సమయం లోనే  పాకిస్తాన్ రహదారి నిర్మించింది .అలా సరిగ్గా 550 జయంతిని పురస్కరించుకొని ఈ కర్తార్ పూర్ గురుద్వారా లోకి భారత సిక్కులకు ప్రవేశం సులువైంది... సిక్కుల ఆనందాలకు కానుకగా ఇరుదేశాలు ఇచ్చిన బహుమతే ఈ కర్తార్ పూర్ కారిడార్ అని చెప్పవచ్చు. పాకిస్థాన్ లోని  కర్తార్పూర్ సాహిబ్ లోకి ప్రవేశించాలంటే ఎవరైనా $20 చెల్లించవలసి ఉంటుంది. ప్రవేశ రుసుము కింద పాకిస్థాన్ ప్రభుత్వానికి కట్టవలసి ఉంటుంది

ఎలా చేరుకోవాలి?
ప్రతి భారతీయ సిక్కు పాకిస్తాన్ లో ఉన్న కర్తార్పూర్ సాహిబ్ దర్శించాలని అనుకుంటారు.. ఈ కర్తార్ పూర్ కి చేరుకోవాలంటే ముందుగా పంజాబ్లోని గురుదాస్పూర్ నుండి నాలుగు కిలోమీటర్లు ప్రయాణించాలి.. అలా ప్రయాణించాక అంతర్జాతీయ సరిహద్దు వస్తుంది ఆ సరిహద్దు గుండా పాకిస్తాన్ లోకి అడుగు పెడతారు. ఆ తర్వాత పాక్ భూభాగం లో నుండి మరో రెండు కిలోమీటర్లు ప్రయాణిస్తే కర్తార్పూర్ సాహిబ్  కి చేరుకుంటారు . మీరు ప్రయాణించడం కోసం అక్కడ బస్సు సౌకర్యాలు ఉంటాయి. దాంతో మీరు సులువుగా పాకిస్తాన్ భూభాగంలోకి అడుగు పెట్టవచ్చు..జాగ్రత్త పాస్ పోర్ట్ నీ వెంట తీసుకు వెళ్ళండి. సాహిబ్ లోకి ప్రవేశించాక అక్కడి సూచనలను పాటించండి. వీలైతే పాకిస్తాన్ కరెన్సీ తో అక్కడి మార్కెట్లో షాపింగ్ చేయండి . అక్కడ ఉన్న వాళ్లతో మాట్లాడండి.  మళ్ళీ క్షేమంగా ఇండియాకి వచ్చేయండి...

మరింత సమాచారం తెలుసుకోండి: