తేనె వేట ఇంగ్లీష్ లో హనీ హంటింగ్  ఇప్పుడు ఇది పర్యాటకులని  ఆకర్షిస్తుంది. నేపాల్ లో ఉన్న ఈ ప్రదేశం  ప్రాధాన్యతని సంతరించుకుంది .. నేపాల్ లో తేనె వేట ఇప్పటిది కాదు చాలా కాలం నుండి చేపట్టబడుతుంది. ఇప్పుడు ఇక్కడికి పర్యాటకులు రావడం వల్ల దగ్గర్లోని గ్రామ ప్రజలు తేనెని వేటాడే  పద్దతిని కళ్లారా చూస్తున్నారు మరియు దాన్ని చిత్రీకరించి సోషల్ మీడియా లో అప్లోడ్ చేయడం వలన  ఈ ప్రదేశం గురించి ప్రపంచమంతా తెలిసింది ..  ఆలా తెలియడంతో ఎంతోమంది సాహసికులు నేపాల్ కి వెళ్లి దగ్గరుండి మరి తేనె వేట ఎలా చెస్తారు తేనె ని ఈ విధంగా సేకరిస్తారో తెలుసుకుంటున్నారు. మరియు స్వయంగా తీసిన తేనెను రుచి చూస్తున్నారు .. అక్కడ ఉండి    చూసేవారికి ఆ దృశ్యం  భయంగొల్పే లాగా ఉంటుంది . కానీ పైకెక్కి తేనె ని వేటాడే వారికీ ఎలా వుంటుంది ఒకసారి ఊహించండి ..కొన్ని వందల మీటర్లు ఎత్తు లో నిలబడి తేనెటీగల్ని బెదరగొట్టి తేనెని సేకరించడం  అంటే మాములు విషయం కాదు దీని ఎంతో గుండెధైర్యం మరియు ఓపిక , తేనెటీగకు కుట్టిన భరించే శక్తి ఉండాలి .. ఒకసారి ఆ నేపాల్ బీ కథ ఏంటో చూద్దామా .  

నేపాల్ లో ఉండే ఈ చోటు గురించి తెలిస్తే మీకు నిజంగా భయం వేస్తుంది సాహసం చేసే వాళ్ళు మాత్రమే ఇక్కడికి రావాలని నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది..
చుక్క తేనె కోసం నేపాల్ గ్రామస్థులు గొప్ప సాహసాలే చేస్తున్నారు.. ఇంతకి ఏంటా సాహసం.?? నేపాల్ లోని ఒక కొండ ప్రాంతం తేనెటీగలకు నిలయాలుగా మారాయి... అయితే అక్కడ గుడిసెల్లో నివసించే ప్రజలు ఎన్నో ఏళ్ల నుంచి తేనె ని సేకరిస్తున్నారు.. ఇదే ప్రస్తుతం ఇక్కడి ప్రజల జీవనాధారం. దీని కోసమే వాళ్ళ ప్రాణాలనే పణంగా పెడుతున్నారు . సుమారు 200 మీటర్ల ఎత్తులో నిచ్చెన పై వేలాడుతూ ఆ గ్రామస్తులు తేనెను సేకరిస్తున్నారు. రెప్పపాటులో కాలు జారిన మరణం సంభవించే ఈ చోటు గురించి తెలిస్తే మీకు నిజంగా భయం కలగడం ఖాయం. రోజుకు కొన్ని వేల తేనెటీగలు వారిని కుడుతున్న అవేమీ పట్టించుకోకుండా 200 మీటర్ల ఎత్తులో ప్రమాదపు అంచున ఉంటూ తేనె ను సేకరిస్తున్న వీరి యొక్క గుండె ధైర్యాన్ని మెచ్చుకోక తప్పదు. వీరి చేస్తున్న దాన్ని చూసేందుకు విదేశీ పర్యాటకులు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తారని ఆ విదంగా వచ్చిన డబ్బుతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామని వాళ్ళు చెబుతున్నారు...

మరింత సమాచారం తెలుసుకోండి: