పోలీసులంటే ప్రజలకు ధైర్యం. మనకు ఏ విధమైన సమస్య ఉంటే ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పుకుంటాం అలాగే సమాజంలో సమస్య ఉంటే పోలీసులకు చెప్పుకుంటాం అంటే ఇంట్లో తల్లిదండ్రుల స్థానాన్ని సమాజంలో పోలీసులకి ఇచ్చింది రాజ్యాంగం అలాంటి ఇ ఉన్నతమైన పదవిలో ఉండి కొందరు చేసే తప్పుల వల్ల మొత్తం పోలీస్ అనే పదానికి చెడ్డ పేరు వస్తుంది. అయితే పోలీస్ ముసుగులో ఉండి ఒకడు చేసిన పనికి ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతయుత వృత్తిలో ఉండి చేస్తున్న పనికే కలంకం తీసుకువచ్చాడు.

 ఓ ప్రబుద్దుడు. ధర్మానికి అండగా నిలవాల్సిన పోలీస్‌ ఉద్యోగం చేస్తున్న వ్యక్తి మహిళను టార్గెట్‌ చేస్తూ వారిపై తరచు వేధింపులకు పాల్పడ్డాడు. చివరికి బండారం బట్టబయలు అయ్యి జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు. ఈ ఘటన దేశ రాజధానిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గత కొద్ది రోజులుగా పశ్చిమ ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో ఉన్నతమైన పోలీస్ ఉద్యోగంలో ఉన్న ప్రబుద్ధుడు డు డు డు మహిళలను వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదులు వస్తున్నాయి. నంబర్‌ ప్లేట్‌ లేకుండా ఓ వ్యక్తి కారులో ఒంటరిగా తిరుగుతూ, బాలికలు, మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ద్వారక ప్రాంతంలో పోలీస్‌ సిబ్బందిని అప్రమత్తం చేశారు.

సంఘటన స్థలంలో వ్యక్తి ఉపయోగించిన కారు ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించి శనివారం అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులు దర్యాప్తులో ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూశాయి. నిందితుడు జనక్‌పురికి చెందిన పునీత్‌ గరేవాల్‌ ఢిల్లీలో సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నట్లు తేలింది దీంతో ఖంగుతిన్న పోలీసులు ఏం చేయాలో అర్థం కాక కాసేపు ముక్కున వేలేసుకున్నారు అయితే ఒక ఉన్నతమైన పదవిలో ఉంటూ పోలీస్ అనే మాటకి కళంకం తెచ్చిన ఈ ప్రబుద్ధున్ని ఎంత మాత్రము వదిలేది లేదని ఖరాఖండీగా చెప్పారు అక్కడున్న పోలీసులు. నిందితునిపై ఏపీసీ సెక్షన్లు 354డీ,354 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: