ఈ ప్రపంచంలో మనిషి సాధించలేనిది అంటూ ఏమి లేదు. దేవుడు మనుషులందరికి ఒకే రకమైన తెలివి తేటలు  ఇస్తాడు. పట్టుదల ఉంటే ఏదైన సాధించవచ్చు. దానికి పెద్ద పెద్ద చదువులు అవసరం లేదు. సాధించాలన్న తపన ఉంటే చాలు. అలాంటి మనుషులలో ఈ వ్యక్తి కూడా ఒకరు. ఇండియా హెరాల్డ్ అందిస్తున్న వివరాల్లోకి వెళితే.... కేరళ కు చెందిన ఓ సైకిల్ షాపు యజమాని స్వయంగా లగ్జరీ బైక్‌ను తయారు చేసుకుని ఆశ్చర్యపరిచాడు. అందుబాటులో ఉన్న వస్తువులతోనే అద్భుతంగా మలచిన ఈ బైక్‌‌కు పెట్రోల్ అక్కర్లేదు. ఎందుకంటే ఇది ఎలక్ట్రిక్ బైక్. దీనికి బ్యాటరీ ఉంటే చాలు దూసుకెళ్తుంది.

కేరళలోని త్రిస్సూర్ జిల్లా ఎడ్వవిలాంగు గ్రామంలో నివసిస్తున్న నిసార్ ఈ బైక్‌ను తయారు చేశాడు. ఈ బైకు తయారీ కోసం అతడు ఎక్కువ పరికరాలు ఏమి కొనలేదు.  కేవలం రెండు టైర్లు మాత్రమే కొన్నాడు. మిగతా సామాన్లు వ్యర్థాల దుకాణంలో కొనుగోలు చేశాడు. ఈ బైకు తయారీకి సుమారు ఒక సంవత్సరం పాటు  శ్రమించాడు. రేయింబవళ్లు నిద్రపోకుండా  చాలా శ్రమించి ఈ బైక్ ని తయారుచేసాడు. చివరికి తన కలను నెరవేర్చుకున్నాడు.

బండి విషయానికి వస్తే.... 48V DC మోటార్‌తో నడిచే ఈ బైక్ ఎలాంటి కాలుష్యాన్ని వెదజల్లదు. దీని మార్కెట్లో పెడితే సుమారు రూ.లక్ష వరకు ధర పలకవచ్చని నిసార్ భావిస్తున్నాడు. ఈ బైకును చూస్తే.. షోరూమ్ నుంచి వచ్చిన కొత్త బైకనే అనుకుంటారు. ఇప్పుడు నిసార్.. తను సొంతంగా తయారుచేసుకున్న ఈ బైక్ తో హ్యాపీ గా ఊరు ఊరంతా తిరుగుతున్నాడు. అతను భవిష్యత్ లో ఇంకా ముందుకు వెళ్లాలని కోరుకుందాం.

ఇలాంటి మరిన్ని వైరల్ వార్తల కొరకు ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి..

ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.. ' data-card-branding='0' class='embedly-card'>


మరింత సమాచారం తెలుసుకోండి: