ఏపీలో 2019 ఎన్నికల్లో “రావాలి జగన్.. కావాలి జగన్” అనే నినాదం ఎంత వైరల్ అయ్యిందో మనందరికి తెలిసిందే. వైసీపీ పార్టీ ప్రచారంలో ఆ పాట విపరీతంగా ఉపయోగ పడింది.ఆ పాట జనల్లో ఎంతగా వైరల్ అయిందో మనం చూశాం. అయితే ఇప్పుడు ఇదే నినాదం గ్రేటర్ ఎన్నికల్లో కూడా వినిపిస్తుంది. అదేంటి గ్రేటర్ ఎన్నికలలో వైసీపీ పోటీ చేయడం లేదు కదా.. అలాంటప్పుడు ఆ నినాదం ఎందుకు వినిపిస్తుందని. అనుకుంటున్నారా..

 సందేహం వచ్చింది కదా. అయితే అసలు విషయానికి వస్తే గ్రేటర్ పరిధిలోని జగద్గిరిగుట్ట నుంచి కొలుకుల జగన్ అనే నాయకుడు టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు.అయితే ఆయన ప్రచార రథంపై రావాలి జగన్.. కావాలి జగన్ అని ఉంది. ఏపీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు ఎవరో వాడిన ఎన్నికల ప్రచార వాహనానికి గులాబీ రంగులు వేసి వాడుకుంటున్నారని ఆ హడావిడిలో ‘రావాలి జగన్.. కావాలి జగన్’ స్టిక్కర్‌ను తొలగించడం మర్చిపోయి ఉంటారని అంతా అనుకున్నారు. 

కానీ ఇది కావాలని మరీ రాయించారట. తన పేరులో జగన్ అని ఉండడంతోనే ఇలా రాయించారని చెబుతున్నారట. ఏది ఏమైనా ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది...మరి ఏపీలో జగన్ గారికి మంచి బూస్టప్ ఇచ్చిన ఈ పాట..తెలంగాణలో ఈ జగన్ గారికి ఎంత వరకు ఉపయోగ పడుతుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: