ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ వైరల్ న్యూస్ చదవండి...కొంతమంది ఉంటారు డబ్బులు ఎక్కువయ్యి ఏమి చేస్తారో వారికే తెలీదు.అనేక పిచ్చి పిచ్చి పనులు చేస్తూ పేరు సంపాదించాలని చూస్తుంటారు. డబ్బులు ఉన్నాయని బాగా ఖరీదైన కార్లు కొంటారు. కాని ఖరీదైన కారు కొంటే సరిపోదు. దాన్ని నడపడం కూడా చేతకావాలి. లేకపోతే.. పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఇంగ్లాండ్‌లోని ఎసెక్స్ కౌంటీలో మన్నింగ్ ట్రీ ప్రాంతంలో పోర్స్చే టేకాన్ కారును ఓ ఇంటి ముందు పార్క్ చేయబోయిన డ్రైవర్ అదుపుతప్పి.. ఎదురుగా ఉన్న ఎస్‌యూవీని ఢీకొట్టాడు. ఆ తర్వాత ఆ రోడ్డుకు దిగువన ఉన్న మరో కారు మీద ల్యాండైంది. దీంతో ఆ మూడు కార్లు బాగా దెబ్బతిన్నాయి.ప్రమాదం జరిగిన ఇంటికి ఎదురుగా ఉన్న మరో ఇంట్లోని సీసీటీవీ కెమేరాలో ఈ ఘటన రికార్డైంది.



ఈ వీడియోని ఓ ట్విట్టర్ యూజర్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇప్పుడు ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ప్రమాదం చూసి నెటిజనులు ఫన్నీగా స్పందిస్తున్నారు. ఆ కారును నడిపింది అమ్మాయే కావచ్చని కామెంట్లు చేస్తున్నారు. వారే అంత రఫ్‌గా పార్కింగ్ చేస్తారని, అబ్బాయిలు పార్కింగ్ చేసే తీరు వేరేగా ఉంటుందని అంటున్నారు. పోర్స్చే డ్రైవర్ ఒక్కసారిగా ఎస్కలేటర్‌పై కాలు వేయడం వల్ల కారు వేగంగా ముందుకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదం జరిగిన తీరును చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఆ వీడియోను కింది ట్వీట్లో చూడండి.ఇలాంటి మరెన్నో వైరల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇలాంటి మరిన్ని వైరల్ న్యూస్ లు తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: