ఏపీ రాష్టంలో జగన్ గారు కొత్త.. కొత్త.. నిర్ణయాలతో ముందుకు పోతున్నారు.తాజా మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు.రాష్టంలో గ్రామాలకు ఇంటర్నెట్ అందించే విధంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.దీంతో  రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి, గిరిజన గూడేనికీ ఇంటర్‌నెట్‌ సౌకర్యం కలగనుంది.

 కొండకోనల మధ్య ఉండే గిరిజన గ్రామాలకు సైతం ఇంటర్‌నెట్‌ సేవల్ని అందించేం దుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం కట్టింది. ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ నిర్వహణకు ఇంటర్‌ నెట్‌ తప్పనిసరి కావడంతో ఫైబర్‌ నెట్‌ కార్పొరేషన్‌ ద్వారా ప్రతి గిరిజన గ్రామానికీ ఈ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టింది.

ఇప్పటికే 134 గిరిజన గూడేల్లో ఫైబర్‌ నెట్‌ కనెక్టివిటీ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇందుకోసం రూ.3 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఫైబర్‌ నెట్‌ కార్పొరేషన్‌కు ఇప్పటికే చెల్లించిందని సమాచారం. మరి రాష్టా ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ఎటువంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: