ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...కొంతమంది మనుషులు ఉంటారు వారు ఎంతకైనా తెగిస్తారు. తమ అనుకున్న వాళ్ళు కోసం ఎంత రిస్క్ అయినా చేస్తారు. ప్రాణాలు ఇవ్వడానికి కూడా తెగిస్తారు. తమ పెంపుడు జంతువులను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారనే సంగతి తెలుసు. కానీ, ఇలా తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తమ పెంపుడు జంతువులను కాపాడుకుంటారనేది ఈ వీడియో చూశాకే అర్థమవుతుంది. ఫ్లొరిడాకు చెందిన ఓ వ్యక్తి ఇదే చేశాడు. నీటిలో మొసలి నోటికి చిక్కిన తన కుక్క పిల్లను కాపాడేందుకు ఆయన ఏకంగా తన ప్రాణాలను ఫణంగా పెట్టాడు. మొసలిని తన చేతులతో బయటకు లాక్కొచ్చి మరీ తన కుక్క పిల్లను కాపాడుకున్నాడు.రిచర్డ్ విల్‌బ్యాంక్స్ అనే వ్యక్తి ఓ కొలనులో మొసలి నోటికి చిక్కిన తన పెంపుడు కుక్కను చూసి షాకయ్యాడు.


దీంతో రిచర్డ్ మరో ఆలోచన లేకుండా.. ఒక్క ఉదుటున నీటిలోకి దూకాడు. ఆ మొసలిని బయటకు తీసుకొచ్చి దాని నోటిలో ఉన్న కుక్కను విడిపించేందుకు ప్రయత్నించాడు. ఎట్టకేలకు ఆ మొసలి బలమైన పట్టు నుంచి కుక్కను విడిపించాడు. అయితే, ఆ మొసలి చిన్నదే కావడంతో అతడు కుక్క పిల్లను కాపాడగలిగాడు. అదే పెద్ద మొసలైతే.. అంత సులభంగా పట్టువీడదు.లీ కౌంటీలోని బిర్డెర్ హబిట్యాట్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వన్య ప్రాణులు తిరిగే ఆ ప్రాంతంలోనే ప్రజలు నివసించేందుకు ప్రభుత్వం అనుమతించింది.


కెమేరాల ద్వారా జంతువులపై నిఘా ఉంచుతున్నారు. వాటిలోని ఓ కెమేరాలో ఈ ఘటన రికార్డైంది. ఇది అక్టోబరు నెలలో చోటుచేసుకోగా.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మొసలి దంతాలు బలంగా కుక్క శరీరంలోకి దిగాయని, ప్రస్తుతం కుక్క ఆరోగ్యంగానే ఉందని రిచర్డ్ తెలిపాడు.ఇలాంటి మరెన్నో వైరల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో వైరల్ న్యూస్ ల గురించి తెలుసుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి: