వర్షాకాలం అయిపోయిన కూడా వరుస తుఫాన్ల ముప్పు ఏపీని వెంటాడుతోంది.ఇప్పటికే వర్షాకాలంలో కురిసినా అతి భారీ వర్షాలకు తెలుగు రాష్టాలు అతలాకుతలం అయ్యాయి.మరొక తుఫాన్ ప్రభావం ఉండబోతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.ఈ తుఫాన్ పేరు "నివర్" గా పేర్కొంది.దీంతో ప్రజలు ఆందోళనకు గురౌతున్నారు.

తుఫాన్ తమిళనాడు, పుదుచ్చేరితోపాటు ఆంధ్రప్రదేశ్‌పై ప్రభావం ఉంటుందని వాతావరణశాఖ అంచనా వేసింది. నివర్ బుధవారం తీవ్ర తుఫాన్‌గా తీరం దాటాక.. అదేరోజు అదే తీవ్రతతో చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఆ జిల్లా మీదుగా వెళుతుండగానే అది వాయుగుండంగా బలహీనపడే అవకాశాలు ఉన్నాయి.

ఏపీలోని చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఈనెల 25, 26న అతి భారీ వర్షాలు పడతాయని చెబుతున్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో వేటకు వెళ్లొద్దని మత్స్యకారుల్ని హెచ్చరించారు. విశాఖ, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నంలో మొదటి ప్రమాదహెచ్చరిక ఎగురవేశారు.పుదుచ్చేరిలోని కరైకల్‌, తమిళనాడులోని మామల్లపురం మధ్య తీరం దాటేప్పుడు గంటకు 100 కి.మీ నుంచి 120 కి.మీ దాకా గాలులు వీచే అవకాశముంది.ఇప్పటికే అతి భారీ వర్షాలతో భారీగా నష్టపోయిన రైతులు ఈ 'నివర్' తుఫాన్ ప్రభావం ఏ మేర ఉంటుందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: