గ్రేటర్ ఎన్నికల నేపద్యంలో హోరాహోరీ పోరుకు సిద్దమయ్యాయి.రాజకీయా పార్టీలు.పలు రకాల వారాలు కురిపిస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నాయి.అలాగే తెలంగాణ అధికార ప్రభుత్వం గ్రేటర్ ఎన్నికల సంధర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో టాలీవుడ్ ఇండస్ట్రీ మీద ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది.

కే‌సి‌ఆర్ ప్రకటించిన మేనిఫెస్టో లో సినీ పరిశ్రమకు సంబందించి 10 కోట్ల లోపు బడ్జెట్ ఉన్న సినిమాలకి రాష్ట్ర జీఎస్టీ రీఎంబర్స్‌మెంట్‌, రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్లకు విద్యుత్‌ కనీస డిమాండ్‌ చార్జీల రద్దు, రాష్ట్రంలోని అన్ని సినిమా థియేటర్స్‌లో షోలను పెంచుకునేందుకు అనుమతి అనుమతి ఇస్తున్నట్లు మేనిఫెస్టో లో పేర్కొన్నారు... అలాగే మహారాష్ట్ర, కర్నాటక, ఢిల్లీలో ఉన్న విధంగా టిక్కెట్ల ధరలను సవరించుకునే వెసులుబాటును. కూడా కల్పిస్తున్నట్టు ప్రకటించారు. పరిశ్రమలో ఉన్న దాదాపు 40వేల కార్మికులకు రేషన్‌ కార్డ్‌, హెల్త్‌ కార్డుల సదుపాయం కల్పించి వారిని కూడా ఆదుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

ఇలా ప్రభుత్వం ఇండస్ట్రీ అభివృద్దికి తోడ్పడే విధంగాపలు రకాల నిర్ణయాలు తీసుకోవడం పట్ల స్టార్ హీరోలు ప్రశంసలు కురిపించారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం ప్రభుత్వ నిర్ణయాల పట్ల తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. ఆయన ట్విట్టర్ లో స్పందిస్తూ ప్రభుత్వ నిర్ణయాలు పరిశ్రమకు గొప్ప ఉత్సాహాన్ని ఇచ్చాయి. పరిశ్రమకు ఊరటనిచ్చేలా నిర్ణయాలు తీసుకున్నందుకు కృతఙ్ఞతలు. ఎంతో మంది కార్మికుల జీవితాలను కాపాడుకునే నిర్ణయాలు తీసుకున్నందుకు థ్యాంక్స్. విపత్కర పరిస్థితుల్లో ముందుకెళ్లేలా సహాయం చేసినందుకు ధన్యవాదాలు అన్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: