ప్రస్తుతం తెలుగులో నడుస్తున్న రియాలిటీ షోలలో బిగ్గెస్ట్ టి‌ఆర్‌పి రేటింగ్స్ తో దూసుకుపోతున్న షో బిగ్ బాస్.  బిగ్ బాస్ సీజన్ 4 రోజురోజుకూ  మంచి రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఒక్కో వారం గడుస్తున్నా కొద్దీ షో మీద హైప్ బాగా పెరిగి పోతుంది.షో చూసే వారు మరింత ఎంటర్టైన్మెంట్ ఆస్వాదిస్తున్నారు.

అయితే ఇప్పుడు మిగిలి ఉన్న కొద్ది మందీ కంటెస్టెంట్స్ లో మొత్తం నలుగురు నామినేషన్స్ లో ఉన్నారు. అయితే ఇపుడు తెలుస్తున్న సమాచారం ప్రకారం ఓ కీలక కంటెస్టెంట్ ఊహించని విధంగా వెనుకబడిపోతున్నారని తెలుస్తుంది. ఆ కంటెస్టెంట్ మరెవరో కాదు జబర్దస్త్ ఫేమ్ మాస్ అవినాష్. ఈ కంటెస్టెంట్ నిన్న జరిగిన నామినేషన్స్ లో కూడా కాస్త తడబడినట్టుగా తెలుస్తుంది.

 ముఖ్యంగా అవినాష్ లో ఒక భయం అలాగే చిన్నగా క్లారిటీ మిస్సవ్వడం వంటివి చూసే వీక్షకులు గమనించే ఉంటారు. అందుకే ఈ కంటెస్టెంట్ ఓటింగ్ లో వెనుకబడ్డట్టు తెలుస్తుంది. అది కూడా ఏ రేంజ్ లో అంటే ఇన్నాళ్లు డౌన్ లో ఉండే అరియానా ఓటింగ్ అతన్ని మించి ఓట్లు రాబట్టగలిగిందంటే అవినాష్ ఎంత వెనకబడ్డాడో తెలుస్తుంది. దీనితో మోస్ట్ ఎంటర్టైనర్ కంటెస్టెంట్ గా ఉన్న అవినాష్ కాస్తా వెనకబడడంతో ఆయన అబిమానులు నిరాశ చెందుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: