సోనూసూద్ అంటే ఇప్పుడు ఇండియా లో తెలియని వాళ్ళు ఉండరు.సినిమాల్లో విలన్ గా నటిస్తున్నప్పటికి నిజ జీవితంలో మాత్రం ఆయన రియల్ హీరోనే.  సహాయానికి నిలువెత్తు నిదర్శనం అయన.ఇప్పటికే ఎంతో మంది కష్టాల్లో వున్నవారు ఏ ములా ఉన్న తన చేతనైన సహాయం చేస్తాడు. కరోనా వలన ఏర్పడిన లాక్ డౌన్ టైంలో వివిధ ప్రాంతాలలో చిక్కుకపోయిన వలసకూలీల కోసం ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసి వారిని స్వస్థలలకు చేర్చి వారి పాలిట దేవుడుగా నిలిచాడు.

 కష్టం అనే మాట వస్తే చాలు అక్కడ వాలిపోతున్నాడు ఈ రియల్ హీరో. సమస్య కనిపిస్తే చాలు అక్కడ ఆయన ఒక పరిస్కారంగా కనిపిస్తున్నాడు.. దీనితో ఇప్పుడు ఎక్కడ చూసిన సోనూసూద్ పేరు మారుమోగుతోంది. అయన చేస్తున్న  సేవలకి గాను ప్రధాని మోడీ గారు కూడా సోనూసూద్ ని ప్రశంసించారు.అంతే కాకుండా అటు ఐక్యరాజ్యసమితి స్పెషల్ హ్యుమానిటేరియన్ యాక్షన్ అవార్డుతో సోనూసూద్ ను ఘనంగా సత్కరించిన సంగతి తెలిసిందే.ఇప్పుడు సోనూసూద్ మరో ఘనత సాధించాడు.

ట్విట్టర్ లో అత్యధిక ఫాలోవర్లను కలిగివున్న భారతీయుల్లో టాప్-4కు దూసుకెళ్లాడు. టాప్ 3లలో మొదటి స్థానంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉండగా, రెండో స్థానంలో రాహుల్ గాంధీ ఉన్నారు. ఇక మూడో స్థానంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఉన్నారు. వీరి తరవాతి స్థానంలో సోనూసూద్ నిలిచాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా అనలిటిక్స్ వెల్లడించింది. సినీ స్టార్స్ ని, రాజకీయ నాయకులను సైతం వెనక్కి నెట్టేసి సోనూసూద్ నాలుగో స్థానంలో నిలవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: