ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ వైరల్ న్యూస్ చదవండి.... ప్రపంచంలో ఎప్పుడు ఎం జరుగుతుందో ఏమో ఏమి అర్ధం కాదు. ఒక్కోసారి జరగ కూడని పనులు జరుగాతాయి. అవి చాలా ఆశ్చర్యానికి గురి చేస్తాయి. అసలు నమ్మశక్యంగా ఉంటాయి..నీళ్లు రావాల్సిన కుళాయి నుంచి నిప్పులు రావడమేంటి... ఇదెలా సాధ్యం అవుతుంది అసలు నీరు-నిప్పు.. రెండూ కలవలేవనే సంగతి తెలిసిందే. అయితే, అయితే ఇది వింటే. మాత్రం అసలు మీరు నమ్మనే  నమ్మరు. ఎందుకంటే.. ఇంట్లోని కుళాయి నుంచి నీటితోపాటు మంటలు కూడా వస్తున్నాయి. తూర్పు చైనాలోని లియోనింగ్ ప్రావీన్స్‌లో గల పాంజిన్ నగరంలో ఈ వింత చోటుచేసుకుంది.స్థానిక మహిళ వెన్.. సోషల్ మీడియాలో దాని గురించి పోస్టు చేసింది.


 ‘‘గత మూడు నాలుగేళ్ల నుంచి ఈ సమస్య ఎదుర్కొంటున్నాం’’ అని వెన్ వెల్లడించడం గమనార్హం. ఇంట్లోని వంట గది, స్నానాల గదిలో ఉన్న సింక్‌ నుంచి ఒక్కోసారి అకస్మాత్తుగా మంటలు చెలరేగుతున్నాయని, ఆమె తెలిపింది.దీనిపై స్థానిక నీటి సరఫరా సంస్థకు ఫిర్యాదు చేయగా.. తమ చేతుల్లో ఏమీ లేదని చెప్పి చేతులు ఎత్తేశారట.తమ ప్రాంతంలోని సుమారు వందకు పైగా కుటుంబాలు ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నాయని ఆమె తెలిపింది. ఈ ఇష్యూ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు దిగిరాక తప్పలేదు.


ఈ సమస్య గురించి తెలియగానే ఆ ప్రాంతంలో నీటి సరఫరా నిలిపేశామని ప్రకటించారు. తాత్కాలిక అండర్ గ్రౌండ్ వాటర్ సిస్టమ్‌లో లోపం వల్ల ఈ సమస్య ఏర్పడిందని, నీటి సరఫరా పునరుద్ధరించామని వెల్లడించింది. అండర్ గ్రౌండ్ వాటర్ సిస్టమ్‌లోకి గ్యాస్ లీక్ కావడం వల్లే ఈ సమస్య ఏర్పడి ఉండవచ్చని తెలిపింది. దీనిపై విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపింది.ఇలాంటి మరెన్నో వైరల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో వైరల్ విషయాలు తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: