తెలుగు సినిమాతో తన ప్రస్థానం మొదలుపెట్టి తమిళనాట స్టార్ హీరోగా తనకంటూ బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న స్టార్ హీరో అజిత్. తమిళనాట అజిత్ క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఆయనకు సంబంధించిన ఏ విషయమైనా, ఆయన సినిమాలకు సంబంధించిన చిన్న అప్డేట్ అయినా సరే పెద్ద ట్రెండ్ అయిపోతుంది. ఆయన సినిమాకు సంబంధించి పోస్టర్స్ గాని, టీజర్స్ గాని, విడుదల అయితే రికార్డుల మోత మోగాల్సిందే. ఇక ఆన్ లొకేషన్ వర్కింగ్ స్టిల్స్ అయితే దుమ్ము దులిపేస్తుంటాయి.

 అజిత్ ప్రస్తుతం హెచ్.వినోద్ దర్శకత్వంలో ‘వాలిమై’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. అజిత్ అంటే రియల్ స్టంట్ లకు పెట్టింది పేరు. తన సినిమాలో ఏదో ఒక ఫైట్ సీన్ లో గాని, చేజింగ్ సీన్ లో కాని డూప్ లేకుండా రియల్ స్టంట్స్ చేస్తుంటాడు. అలాగే ఈ సినిమాలో కూడా అజిత్ డూప్ లేకుండా స్వయంగా యాక్షన్ సన్నివేశాలు చేస్తున్నారు. ముఖ్యంగా బైక్ స్టంట్స్ చేస్తున్నారు. దానికి సంభందించిన ఫోటో ఒకటి రిలీజ్ చేశారు టీమ్.అజిత్ తన సూపర్ బైక్ ఫ్రంట్ వీల్ గాల్లోకి లేపి విన్యాసం చేస్తున్న ఆ ఫోటో అభిమానులకు విపరీతమైన కిక్ ఇస్తుంది.

ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియా మొత్తం అదే ట్రెండ్ అవుతోంది. ఈ ఫోటో చూస్తున్నా తన అభిమానులు ఆయనను పొగడ్తలలో ముంచుతున్నారు. ఎంతటి స్టార్ హీరోలైనా అజిత్ తరహాలో ఇలా సొంతగా బైక్ స్టంట్స్ చేయరు కదా అంటూ తమ హీరో మీద పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఈ సాహసాలు చేస్తూనే అజిత్ ఇటీవల గాయపడ్డారు. అయినా చిత్రం యొక్క షూటింగ్ వాయిదా వేయకుండా చేస్తూనే ఉన్నారు. అజిత్, వినోద్ కాంబినేషన్లో వచ్చిన గత చిత్రం ‘నెర్కొండ పారవై’ మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో బాలీవుడ్ నటి హుమా ఖురేషి కథానాయికగా నటిస్తుండగా తెలుగు యువ హీరో కార్తికేయ నెగెటివ్ రోల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: