కరోనా ప్రపంచంలోకి వచ్చి ఏడాది పూర్తి కావచ్చిన ఇంకా ఈ మహమ్మారికి వ్యాక్సిన్ రాలేదు.ఇంకా కరోనా ప్రభావం ఏ మాత్రం తగ్గలేదు.‌ ప్రపంచాన్ని భయపెడుతూనే ఉంది ఈ మహమ్మారి.ప్రజలు వ్యాక్సిన్ కోసం ఆలోచించడం మానేసి కరోనా తో సహజీవనం చేయడం అలవాటు చేసుకున్నారు..ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల సెకండ్ వేవ్.. మరికొన్నిచోట్ల  థర్డ్ వేవ్ తో ‌ ప్రజల్లోనూ ప్రబుత్వల్లోనూ వణుకుపుట్టిస్తోంది... మరోవైపు కరోనా వ్యాక్సిన్‌ కోసం రకరకాల పరిశోధనలు చేస్తూనే ఉన్నారు సైంటిస్టులు.. కరోనా కి వ్యాక్సిన్ వచ్చేసిందని సైంటిస్టులు ఇప్పటికే ప్రకటించారు. 

అయితే ఇంకా టెస్టింగ్ లోనే ఉండడం వల్ల అందుబాటులోకి రాలేదు.అయితే తాజాగా భారత్‌లోనూ కోవిడ్‌కు చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్‌ సిద్ధమవుతోందని.. ఇప్పటికే సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రధాని మోడీ.. వ్యాక్సిన్‌పై సీఎంలతో చర్చించారు. ఒక‌వేళ  వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో సిద్దమైతే, అప్పుడు తొలి ద‌శ‌లో సుమారు 30 కోట్ల మంది భార‌తీయుల‌కు ఆ టీకాను ఇవ్వనునట్టు సమాచారం.. 

దీనిపై భార‌త ప్రభుత్వం పక్క ప్రణాళిక సిద్ధం చేస్తోందట. అయితే ఈ కరోనా వ్యాక్సిన్‌ను ముందుగా కోవిడ్ బాదితులకు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.తరువాత హెల్త్ కేర్ వ‌ర్కర్లు, పోలీసులకు ఇవ్వనున్నారు.. ఆ తర్వాత 50 ఏళ్లు దాటిన వారితో పాటు అనారోగ్యంగా ఉన్న యువ‌త‌కు కూడా ఈ టీకాను తొలి ద‌శ‌లో ఇచ్చేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్టు ప్రిన్సిప‌ల్ సైంటిఫిక్ అడ్వైజ‌ర్ కే విజ‌య్ రాఘ‌వ‌న్ వెల్లడించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: