ఎప్పుడు లేనంతగా ఈ సంవత్సరం వర్షాలు బీభత్సం సృస్టించాయి,ఇంకా సృస్టిస్తూనే వున్నాయి.వర్షా కాలం ముగిసి, శీత కాలం జరుగుతున్నా వర్షాలు తగ్గుముఖం పట్టడం లేదు.తాజాగా నివర్ తుఫాన్ ధాటికి ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అయింది.  చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో నివర్ తుఫాన్ బీభత్సం సృస్టించింది.  దీని నుంచి బయటపడకముందే బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది.  

ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది.ఈ తీవ్ర వాయుగుండం తుఫాన్ గా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.  డిసెంబర్ 2 వ తేదీన 'బురేవి' తుఫాన్ ఏపీ పైన తీవ్రమైన ప్రభావం చూపబోతున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది.  ఈ తుఫాన్ ప్రభావం వలన ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రతో పటు రాయలసీమపై దీని ప్రభావం ఉండబోతుందట.

అంతేకాదు, డిసెంబర్ 5 వ తేదీన మరొక అల్పపీడనం కూడా ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.దీనికి 'టకేటీ' తుఫాన్ అని పేరు పెట్టింది.ఇది  దక్షిణ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.  దీంతో ఏపీ అప్రమత్తం అయ్యింది.  తుఫాన్ ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించింది.దాదాపుగా ఎనిమిది నెలలు అవుతున్న వర్షాలు తగ్గుముఖం పట్టకపోవడం అందరినీ ఆందోళనకు గురి చేస్తుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: