ఇటీవల విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, పవన్ కళ్యాణ్ పై చేసిన పలు కామెంట్స్ పెద్ద దుమారాన్నే రేపాయి.పవన్ పై ఎన్నడూ లేని విధమైన ప్రకాష్ రాజ్ సంచలన కామెంట్స్ చేశాడు.ఆయన చేసిన వ్యాఖ్యలు పవన్ కల్యాణ్ అభిమానులకు ఆగ్రహం తప్పించాయి.ఐతే ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా మెగా బ్రదర్ అండ్ జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థి నాగ బాబు కూడా అంతే స్థాయిలో ప్రకాష్ రాజ్ కు రిప్లై ఇవ్వడం షాకింగ్ గా మారింది. 

కేవలం రాజకీయ పరంగా మాత్రమే కాకుండా సినిమాల పరంగా కూడా నాగబాబు ప్రకాష్ రాజ్ పై సంచలన ఆరోపణలు చెయ్యడంతో ఈ వివాదం మరింత ముదురుతుంది.నాగబాబు స్పందిస్తూ "ఎవరికి ద్రోహం చేశాడని ప్రతి పనికిమాలిన వాడు మా నాయకున్ని విమర్శిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. నీలో డొల్లతనం సుబ్రహ్మణ్య స్వామి డిబేట్ లోనే తేలిపోయింది.

 అని డబ్బుల కోసం నిర్మాతలను ఎన్ని రకాలుగా నువ్వు హింసలు పెట్టేవాడివో నాకు తెలుసు అని సంచలన వ్యాఖ్యలు చేశాడు.మీడియా ముందు నీ రాజకీయ డొల్లతనం బయట వేసుకోకు." అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.దీంతో ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయితే నాగబాబు ఇచ్చిన రిప్లే కూడా ఒక సంచలనంగా మారింది.



మరింత సమాచారం తెలుసుకోండి: