తెలుగు లో బిగ్గెస్ట్ రియాలిటీ షో గా బిగ్ బాస్ మంచి ప్రజాదరణ పొదుతుంది. విజయవంతంగా మూడు సీజన్లు కంప్లీట్ చేసుకున్నా ఈ బడా షో, నాలుగో సీజన్ కూడా మంచి ప్రజాదరణ పొందుతూ టెలివిజన్ టి‌ఆర్‌పి రేటింగ్స్ లో దూసుకుపోతుంది.కేవలం ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్న బిగ్ బాస్ సీజన్లో ఎవరు విన్నర్ గా నిలుస్తారు అన్నది మరింత ఉత్కంఠ రేపుతోంది.

 అలాగే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న హౌస్ మేట్స్ అంతా కూడా టైటిల్ విన్నింగ్ రేస్ కు టఫ్ కాంపిటేషన్ ఇచ్చే వారే. అయితే జబర్దస్త్ ఫేమ్ అవినాష్ మాత్రం వోటింగ్స్ లో కాస్త వెనకబడ్డాడనే చెప్పాలి. మొదట్లో మంచి వినోదం పంచుతూ అందరినీ ఆకర్షించాడు. కానీ ప్రస్తుతం అతడు అనుకున్న స్థాయి పెర్ఫామెన్స్ కనబర్చడం లేదని ఆడియెన్స్ మాట.అవినాష్ కు జబర్దస్ట్ లో చాలమంది ఫ్రెండ్స్ ఉన్నారు అందరూ కూడా ప్రొఫెషన్ పరంగా అవినాష్ గెలవాలని కోరుకుంటున్నారు కానీ తమ వ్యక్తిగతంగా మాత్రం అతన్ని పక్కన పెట్టేసినట్టే తెలుస్తుంది.

 ఆ మధ్య నాగబాబు, ధనరాజ్ లేటెస్ట్ గా బులెట్ భాస్కర్ లు మాత్రం అభిజీత్ కు సపోర్ట్ చెయ్యడం గమనార్హం. లేటెస్ట్ గా బుల్లెట్ భాస్కర్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తమ సహా కమెడియన్ గా అవినాష్ గెలవాలని కోరుకుంటున్నాని కానీ తాను అయితే అభిజీత్ కే ఓట్ చేస్తానని చెప్పేసాడు. దీనితో అవినాష్ ను వారే కాస్త పక్కన పెట్టినట్టు అయ్యింది ఏదేమైనా కంటెస్టెంట్ పర్ఫామెన్స్ బట్టి ఓటేస్తారని సామాన్యుడి అబిప్రాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: