బిగ్ బాస్ చివరి దశకు చేరుకునే కొద్ది షో ను మరింత వినోద భరితంగా ప్లాన్ చేస్తున్నారు బిగ్ బాస్ మేకర్స్. ఈ వారం బాగా బోరింగ్ గా సాగుతుంది ఏంటా అనుకున్న వీక్షకులకు ఈ వీకెండ్ ను ఊహించని విధంగా రసవత్తరంగా మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఇన్ని రోజులో బిగ్ బాస్ హౌస్ లో మంచి టాప్ మోస్ట్ కంటెస్టెంట్ గా నిలిచిన కంటెస్టెంట్ అభిజీత్ పై కింగ్ నాగ్ ఫైరవ్వడం ఆశ్చర్యం కలిగించింది.

ముఖ్యంగా క్యాప్టెన్ అయిన హారికాను నాగ్ డైరెక్ట్ గానే అభిజీత్ ను నువ్వు ఎందుకు సేఫ్ చేస్తున్నావని సీరియస్ అవ్వడం, టాస్క్ చెయ్యకపోతే చేయించాల్సిన భాద్యత నీపై ఉందని సూటిగా అడగడం, అలాగే అభిజీత్ ను టాస్కులు ఎందుకు చెయ్యడం లేదు చెయ్యనని చెప్పడం తప్పు కాదా అని ప్రశ్నించడం బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో లో చూపించారు.

 అలాగే మోనాల్ ఎందుకు ఏడిపించావ్ అని ఓ క్లిప్పింగ్ వేసి అభిజీత్ కు మాట లేకుండా చేసారు. ఇక ఫైనల్ గా అభి తో మాట్లాడుతూనే డోర్స్ ఓపెన్ చేశారు.ప్రోమోతోనే ఈరోజు ఏపిసోడ్ కు మంచి హైప్ తెచ్చారు బిగ్ బాస్ మేకర్స్. .దీంతో వీక్షకులకు ఫైనల్ గా ఏం జరగనుందో చూడాలన్న క్యూరియాసిటీ కలిగించారు బిగ్ బాస్ మేకర్స్.
 

మరింత సమాచారం తెలుసుకోండి: