బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా పాపులర్ అయిన నటుడు మరియు సినీ క్రిటిక్ అయినటువంటి కత్తి మహేష్.. జనసేన అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్‌పై ఎప్పటికప్పుడు సమయం, సందర్భం ఉన్నా లేకున్నా కూడా విమర్శలు చేస్తుంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. మొదట్లో పవన్ కళ్యాణ్ అభిమానులు కత్తి మహేష్ చేసినటువంటి విమర్శలన్నింటికీ స్పందిస్తూ ఉండటం వల్ల అప్పటివరకూ ఎవరికీ తెలియని కత్తి మహేష్ ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు. దీనితో కత్తి మహేష్ మరింత రెచ్చిపోయి తెగ విమర్శలు చేయటం మొదలెట్టాడు. తరువాత పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇలాంటి వారి వ్యాఖ్యలపై స్పందించి తమ అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోవద్దని చెప్పటంతో అప్పటినుండి పవన్ కళ్యాణ్ అభిమానులు కత్తి మహేష్ అనవసర వ్యాఖ్యలపై పెద్దగా స్పందించటం లేదు.



అయినా కానీ కత్తి మహేష్ మాత్రం పవన్‌ కళ్యాణ్ పై తన మాటల దాడిని మాత్రం అప్పుడప్పుడు కొనసాగిస్తూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా పవన్ రాజకీయ నిర్ణయాలను చాలా తీవ్రంగా విమర్శిస్తుంటాడు.. ఒక్కోసారి కాస్త ఘాటుగా, కఠవుగా కూడా మాట్లాడుతుంటాడు. అలాంటి సందర్భాల్లో ఇక కత్తి మహేష్‌ను తిట్టినా, బెదిరించినా లాభం లేదనుకుని అతను కేవలం పాపులారిటీ కోసం మరియు డబ్బు కోసమే పవన్ కళ్యాణ్ ని విమర్సిస్తున్నాడు కదా అని పవన్ కళ్యాణ్ అభిమానులు గ్రహించి వినూత్నంగా నిరసనకు దిగారు. కత్తి మహేష్‌ పవన్ కళ్యాణ్ మీద కావాలనే అనవసరంగా లేనిపోని విమర్శలు చేస్తూ ప్రత్యర్ధి వర్గాల దగ్గర చిల్లర సంపాదించుకుంటున్నాడనే ఉద్దేశ్యంతో ఇక అనవసరంగా ఇలాంటి పనులు చేయొద్దని తెలుపుతూ ఇందులో భాగంగా కత్తి మహేష్‌కు చిల్లర డబ్బు పంపించి వినూత్నంగా నిరసన తెలపాలని భావించి అలా చిల్లర డబ్బులను కత్తి మహేష్ అకౌంట్ కి పంపిస్తున్నరంట.



అయితే దీనిని కూడా కత్తి మహేష్ తనకు అనుకూలంగా మార్చుకున్నారు. తనకు చిల్లర డబ్బులు కాదని, ఆ పంపేదేదో, రూ. 100 లేక రూ. 1,000 పంపాలంటూ పవన్ కళ్యాణ్ అభిమానులకు తెలిపారు. ఈ మేరకు శనివారం రాత్రి కత్తి మహేష్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ‘‘అయ్యా పవన్ కళ్యాణ్ అభిమానులూ! నా గూగుల్ పే నంబర్. నా బ్యాంకు అకౌంట్ వివరాలు తెలుసుకుని నాకు 1 రూపాయి. 5 రూపాయలు పంపిస్తున్నారు. మీ ఉద్దేశం ఏమైనా గానీ.. సంతోషం. కానీ, పెరిగిన ద్రవ్యోల్బణం మరియు నా ఖర్చుల దృష్ట్యా ఆ పంపేదేదో 100 రూపాయలో, 1000 రూపాయలో పంపితే, కనీసం నా మందులో మంచింగ్ ఖర్చుకు పనికొస్తుంది. మీ పవర్ స్టార్ మానంమర్యాదలు నిలబడతాయి. ధన్యవాదాలు. ఇట్లు.. మీ చిల్లర అభిమానానికి పాత్రుడు.. కత్తి మహేష్.’’ అంటూ పోస్టు చేశారు. ఇక ఇప్పుడు కత్తి మహేష్ చేసిన ఈ పోస్ట్ పై పవన్ కళ్యాణ్  అభిమానులు ఏవిధంగా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: