ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. తెలుగులో ఇప్పటివరకు వచ్చిన అన్ని బిగ్ బాస్ సీజన్ల కంటే ఈ నాలుగవ సీజన్ చాలా బాగా ఆకట్టుకుంటుంది. మొదట్లో చాలా చప్పగా సాగిన ఈ సీజన్ తరువాత గట్టిగ పుంజుకుంది.టాస్కులు, గొడవలు, అలకలు తో చాలా ఉత్కంఠంగా ఇంకా చాలా వినోదాత్మకంగా సాగిపోతుంది ఈ సీజన్..  కొత్త వాళ్ళతో చాలా ఆసక్తికరంగా దూసుకుపోతుంది. ఇక మొదటి సీజన్ కి ఎన్టీఆర్ రెండవ సీజన్ కి నాని మూడవ సీజన్ కి నాగార్జున వ్యవహరించారు. ఇప్పుడు జరుగుతున్న నాలుగవ సీజన్ కి కూడా నాగార్జునానే హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు.అయితే ఈ మూడు సీజన్లలో ఎన్టీఆర్, నాని లకి మంచి పేరు వచ్చింది. ఎందుకంటే వాళ్ళు అందరికి సమానంగా ట్రీట్ చేస్తూ ఎలాంటి అనవసరమైన డ్రామాలు, హడావిడులు లేకుండా చాలా బాగా హోస్టింగ్ చేశారు.


కాని నాగార్జున హోస్టింగ్ మాత్రం చాలా చెత్తగా ఉందంటూ సోషల్ మీడియా వేదికగా బిగ్ బాస్ లవర్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయానికి వస్తే గత సీజన్ ఒక రకంగా హోస్టింగ్ చేసిన నాగార్జున ఈ సీజన్ అత్యంత చెత్తగా హోస్టింగ్ చేస్తున్నాడని బిగ్ బాస్ లవర్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. హౌస్ మేట్స్ అందరిని సమానంగా ట్రీట్ చేయట్లేదని కేవలం కొంతమందికే సపోర్ట్ ఇస్తున్నాడని నెటిజన్స్ భావిస్తున్నారు. హౌస్ లో చాలా మంచి పార్టిసిపెంట్స్ వున్నా కాని ఎందుకు పనికి రాని వాళ్లనే నాగార్జున సపోర్ట్ చేస్తున్నాడని కోప్పడుతున్నారు. ఇక శనివారం ఎపిసోడ్ తో అయితే నాగార్జున చాలా వరస్ట్ అని తేల్చేశారు ఆడియన్స్.


ఎందుకంటే హౌస్ లో చాలా స్ట్రాంగ్ హౌస్ మేట్ అభిజిత్. అతనికి చాలా మంది ఫ్యాన్స్ వున్నారు. కాని అతని తప్పు లేకుండా కేవలం ఒక పనికిమాలిన టాస్క్ చెయ్యలేదని అతనిపై కఠినంగా వ్యవహారించాడు నాగార్జున. చాలా ఘోరంగా అవమానించాడు. చివరికి అభి సారీ సార్ అని మోకాళ్ళ పై కూర్చొని బతిమాలిన నాగార్జున కనికరించకుండా కఠినంగా వ్యవహారించాడు. ఈ తీరుపై బిగ్ బాస్ లవర్స్ అలాగే అభిజీత్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా దారుణమైన కామెంట్స్ తో నాగార్జున పై విరుచుకుపడుతున్నారు. నాగార్జున ని హోస్ట్ గా తీసేయండి అని తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఇలాంటి మరెన్నో వైరల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...

మరింత సమాచారం తెలుసుకోండి: