ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...ప్రస్తుతం ఎన్నికల పోరు సిద్ధమైంది.గ్రేటర్ హైదరాబాద్ మహానగరం ఎన్నికలకు బాగా సిద్ధమైంది.ఇక ఎన్నికల హడావిడి చాలా రసవత్తరంగా సాగింది. గత రెండు వారాల నుంచి చాలా సందడిగా సాగి ఆదివారం సాయంత్రం ఆరుగంటలకు ముగిసింది. మరి కొన్ని గంటల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అయితే.. గ్రేటర్ హైదరాబాద్ కి  ఎన్నికల్లో ఇప్పటివరకు ఓ చెత్త రికార్డు ఉంది. ఎన్నికల్లో చాలా తక్కువగా పోలింగ్ నమోదవుతోంది. ఈసారైనా కాస్త పెరుగుతుందని అటు రాజకీయ పార్టీలు, ఇటు ఎన్నికల అధికారులు ఆశిస్తున్నారు.చాలా మందికి తమ ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలో తెలీదు. ఈ నేపథ్యంలో ఓటర్లకు అవగాహన కల్పించడానికి జీహెచ్‌ఎంసీ, రాష్ట్ర ఎన్నికల సంఘం పలు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈసారి ఎన్నికలను బ్యాలెట్ ద్వారా నిర్వహిస్తున్నారు.

ఇక ఎన్ని‌కల్లో ఓటు వేసేందుకు వచ్చేవారు.. ఓటరు స్లిప్పుతో ‌పాటు తప్పని‌స‌రిగా ఏదైనా ఒక గుర్తింపు కార్డుతో పోలింగ్ కేంద్రానికి రావాల్సి ఉంటుంది. అయితే.. ఓటరు గుర్తింపు కార్డు లేనివారు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఇతర గుర్తింపు పత్రాలు చూపించి తమ ఓటు వేయవచ్చు.ఆధా‌ర్‌ ‌కార్డు,పాన్ కార్డు,డ్రైవింగ్‌ లైసెన్స్‌,పాస్‌‌పోర్టు ఫొటోలు కలి‌గిన రేష‌న్‌ ‌కా‌ర్డులు,ఉపాధి హామీ జాబ్‌ కార్డు,హెల్త్‌ ఇన్సూ‌రెన్స్‌ స్మార్ట్‌ కార్డు,ఫొటో కలిగి ఉన్న బ్యాంకు పాస్‌ ‌బుక్స్,కేంద్ర, కేంద్ర ప్రభు‌త్వాలు/ప్రభుత్వ రంగ సంస్థలు జారీ‌చే‌సిన సర్వీస్‌ ఐడెంటిటీ కార్డు,పెన్షన్‌ డాక్యు‌మెంట్‌ విత్‌ ఫొటో,నేష‌నల్‌ పాపు‌లే‌షన్‌ రిజి‌స్ర్టార్‌ స్కీమ్‌లో భాగంగా జారీ‌ చే‌సిన స్మార్డ్‌ కార్డు,ఫొటోలు కలి‌గిన ఎస్సీ, ఎస్టీ, బీసీ ధ్రువ‌ప‌త్రాలు,విక‌లాంగులు ధ్రువీ‌క‌రణ పత్రాలు తీసుకెళ్లవచ్చు.ఓటు కార్డు లేకపోయినా ఈ పత్రాలతో ఓటు వెయ్యొచ్చని వెల్లడించారు.ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వార్తల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...ఇంకా ప్రపంచంలో జరిగే మరెన్నో పలు ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి..


మరింత సమాచారం తెలుసుకోండి: