ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. దేవుడు ప్రతి మనిషిని ఒకే విధంగా పుట్టించడు. కొంతమందికి అవయవాలు సరిగ్గా ఇస్తాడు. మరి కొంతమందిని వికాలాంగులుగా పుట్టిస్తాడు. కాని అందరికి సమానంగా ఇచ్చేది ఒక్కటే. అదే తెలివి. తెలివితేటలు అందరికి సమానంగా ఇస్తాడు. కాని కొంతమంది అన్ని సక్రమంగా వున్నా కాని సోమరిపోతుల్లాగా ఏ పని చెయ్యకుండా ఉంటారు. కాని కొంతమంది దివ్యాంగులు మాత్రం తమ ప్రతిభని బయటపెట్టి తాము ఎవ్వరికంటే తక్కువ కాదని నిరూపిస్తారు. పలువురికి ఎంతో ఆదర్శంగా నిలుస్తారు. ఇక అసలు విషయానికి వస్తే.... అంధులు వారు ఈ లోకాన్ని చూడలేకపోవచ్చు. కానీ, వారి ప్రతిభను లోకం చూడగలదు.


చెన్నైలో డిసెంబరు 2న యునికో చారిటబుల్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్లైండ్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో.. అంథులు అరుదైన రికార్డను సొంతం చేసుకున్నారు. కేవలం ఆరు గంటల్లో 50 వైరు కుర్చీలను చేతులతో అల్లి తమ ప్రతిభను చాటారు. ఎందరిలోనో స్ఫూర్తి నింపారు. ఈ సందర్భంగా 50 మంది అంథులు యునికో వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు.ఇలాంటి మరెన్నో వైరల్ వార్తల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి....








మరింత సమాచారం తెలుసుకోండి: