ప్రస్తుతం రాజకీయాల్లో పవన్ హాట్ టాపిక్ గా మారారు.పవన్ రాజకీయ తీరుపై చాలా రకాల విమర్శలు ఎదుర్కొంటున్నారు.ఇటీవల జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించి వెంటనే విరమించుకొని బి‌జే‌పికి మద్దతు తెలిపారు.దీంతో ఆయన రాజకీయ నిర్ణయాలపై ఎన్నో రకాల విమర్శలు,సెటైర్లు వచ్చాయి.దీంతో ఇప్పుడు జనసేనాని ప్రతి విషయంలోనూ ఆచీ తూచీ స్పందిస్తున్నాడు.తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ పోలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.రజిని ఎంట్రీ పై పవన్ కల్యాణ్ స్పందించాడు...

ప్రజలకు సేవ చేసే దృక్పధంతో ఎవ్వరొచ్చిన స్వాగతించాలి అన్నారు.రజిని రాజకీయాల్లోకి రావడం ప్రశంశనియం అన్నారు.అలాగే తీసుకున్న నిర్ణయాలపై స్పందిస్తూ..తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు ఉపయోగకరంగా కేంద్రం కొత్త చట్టాలను తీసుకొచ్చిందని అన్నారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాల్లో ఏమైనా లోపాలుంటే రైతులు, ప్రభుత్వం చర్చించి పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. రైతులకు గిట్టుబాటు ధర కాదు కావాల్సింది లాభసాటి ధర అని అన్నారు.

అయితే పంట నష్టపోయిన ప్రతి రైతుకి ఎకరాకు 35 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాదు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే తమ లక్ష్యమని అన్నారు. అయితే రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై కూడా స్పందించిన పవన్ కళ్యాణ్ రజనీకాంత్‌ ఎప్పటి నుంచో రాజకీయాలపై ఫోకస్ పెట్టారని, బలమైన ఆలోచనతో వస్తున్న నేతలను స్వాగతించాల్సిదేనని అన్నారు. అలాంటి వ్యక్తులు విజయవంతం కావాలని కూడా కోరుకుంటున్నట్టు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: