తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ ఫోర్ లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి తెగ సందడి చేసింది. హౌస్ లో ఎంతో అల్లరి చేస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది ఈ అమ్మడు. బిగ్ బాస్ హౌస్ లో 50 రోజుల పాటు కొనసాగిన దివి ప్రయాణం ... దసరా రోజు ముగిసింది. విజయదశమి రోజు సమంత హోస్ట్ చేసిన ఎపిసోడ్‌లో దివి ఎలిమినేట్ అయి బిగ్‌బాస్ హౌస్‌ కు గుడ్ బాయ్ చెప్పింది. ఇక అప్పటినుండి సోషల్ మీడియాలో ఈ సొట్ట బుగ్గల సుందరి చేస్తున్న హడా విడి మామూలుగా లేదు. చాలా సినిమాల్లో చిన్నచిన్న క్యారెక్టర్లు చేసిన దివి.. బిగ్‌బాస్‌ తర్వాత హీరోయిన్ అవకాశాలు దక్కించుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.

 ఈమె అప్లోడ్ చేస్తున్న వీడియోలకు మరియు ఫోటోలకు ఫిదా అవుతున్నారు తెలుగు కుర్రాళ్ళు. అంతేకాదు మీరు త్వరలోనే పెద్ద హీరోయిన్ అవుతారంటూ తెగ పొగిడేస్తున్నారు. బిగ్ బాస్ ఎంట్రీ అనంతరం నుండి స్పెషల్ ఫాలోయింగ్ తో మంచి  జోరు మీదుంది ఈ పొడుగు కాళ్ళ సుందరి. ప్రస్తుతం దివికి హీరోయిన్ గా కొన్ని ఆఫర్లు వస్తున్నాయని సమాచారం. కాకపోతే కెరీర్ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండే దివి వెంటనే కమిట్ కాకుండా.... ఆమె పాత్ర కీలక మయ్యే మంచి కథ కోసం వెయిట్ చేస్తోందట.

 అయితే ప్రస్తుతం దివి బీచ్ ముందు సందడి చేస్తున్న ఫోటోలు వైరల్ గా మారాయి. బీచ్ ముందు దివి తెల్ల దుస్తులతో డాన్స్ చేస్తూ మెరిసిన విధానం అందర్నీ తెగ ఆకర్షిస్తోంది. ఆమె అందం ముందు ఎగసి పడే అలల సొగసు కూడా చిన్న బోయింది అంటూ  అభిమానులు దివిని సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇలా ఈ అమ్మడి తాజా ఫోటోలు వీడియోలకు క్రేజ్ పెరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: