మన టాలీవుడ్ లో ఉన్న అందరి హీరోలలో ఆల్ టైం హ్యాండ్సమ్ హీరో ఎవరంటే మహేష్ బాబు అని ఎవరైనా టక్కున చెప్పేస్తారు. ఏజ్ 40 పైబడ్డ పాతికేళ్ళ కుర్రాళ్ళు కూడా కుల్లుకునేలా కనిపించడం ఒక్క మహేష్ కే సాధ్యం.వయసు పెరుగుతున్నా సరే ఏమాత్రం మహేష్ లో అది కనిపించదు. అయితే రీసెంట్ గా మహేష్ నుండి వచ్చిన లుక్ చూసి అందరూ కూడా పాత మహేష్ బాబు ను గుర్తు చేసుకుంటున్నారు.

అలా ఆ మధ్య మహేష్ ఓ యాడ్ షూట్ కు గాను సరికొత్త లుక్ తో దర్శనమిచ్చాడు.అలాగే ఇప్పుడు మరొక ఫ్రెష్ లుక్ ను విడుదల చేశారు. మరో కొత్త యాడ్ నిమిత్తం ప్లాన్ చేసిన ఫోటో షూట్ నుంచి మహేష్ తాలూకా లుక్ బయటకు వచ్చింది..అందులో క్లాస్ అండ్ స్టన్నింగ్ గా మహేష్ కనిపిస్తున్నారు.

ముఖ్యంగా ఆ హెయిర్ స్టైల్ మెకోవర్ చూసి అభిమానులు "పోకిరి " సినిమా గుర్తుకు వస్తుందంటూ సోషల్ మీడియా లో హంగామా చేస్తున్నారు.  మొత్తానికి మాత్రం మహేష్ నుంచి వచ్చిన ఈ న్యూ లుక్ సోషల్ మీడియాలో మంచి వైరల్ అవుతుంది. ప్రస్తుతం మహేష్ దర్శకుడు పరశురామ్ తో “సర్కారు వారి పాట” అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రంలో మహేష్ బాబు మూడు విభిన్న లుక్స్ తో దర్శనమిస్తాడని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: