ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. మనిషి బాతుకి జన్మనివ్వడం ఏంటి.. పైగా మగాడు జన్మనివ్వడం ఏంటి? మతేమైన పోయిందా అనుకుంటున్నారా? కాదండి... ఓ వ్యక్తి గుడ్డుని పొదిగి బాతుని ప్రాణాలతో బైటికి తీసాడట. ఇక అసలు విషయానికి వస్తే....‘ఎ చిక్ కాల్డ్ అల్బర్ట్’ అనే యూట్యూబర్ చేసిన ఈ పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ బాతు గుడ్డును పట్టుకుని.. దాన్ని పొదిగించాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్లే.. అతడు గుడ్డును పొదిగి బాతుకు ప్రాణం పోశాడు. ఎక్కడికైనా సరే ఆ గుడ్డును శరీరానికి అతికించుకొనే తిరిగేవాడు. చివరికి తాను అనుకున్నది సాధించాడు.

ఈ సందర్బంగా అతను మాట్లాడుతూ...‘‘నేను బాతులను పెంచుతూ ఉంటాను. ఈ సందర్భంగా కొన్ని బాతు గుడ్లు తెచ్చి కరెంట్ సాయంతో పొదిగేలా ఏర్పాట్లు చేశాను. అయితే.. గతేడాది మా ప్రాంతంలో కరెంటు సమస్య వచ్చింది. దీంతో గుడ్లు పొదగలేదు. ఈ సందర్భంగా నాకు ఓ ఆలోచన వచ్చింది. గుడ్లును పొదిగేందుకు మన శరీరంలోని వెచ్చదనం సరిపోదా అనిపించింది. కొన్ని గుడ్లను తీసుకుని నా శరీరానికి అతికించుకోవడం మొదలుపెట్టాను.ఎట్టకేలకు నా ప్రయత్నం ఫలించింది. నా శరీర వెచ్చదనానికి గుడ్డు బాతులా మారడం ఆరంభమైంది’’ అని తెలిపాడు. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారింది...


మరింత సమాచారం తెలుసుకోండి: