ఒకసారి మన పాత పుస్తకాలను తెరిచి చూస్తే పేజీ మధ్యలో  కొన్నైనా వస్తువులు   కనబడుతుంటాయి .. ముఖ్యంగా అమ్మాయిల పుస్తకాలలో వాటిని ఎక్కువగా చూస్తుంటాం ..
చిన్నపుడు పాఠశాలకు వెళ్లే దారి మధ్యలో ఏమైనా కనబడితే వాటిని మన బ్యాగులో వేసుకుంటాం  . వాటన్నింటిని ఒక పుస్తకరూపంలో  దాచి చిన్ననాటి గుర్తులుగా భద్రపరుస్తుంటాము ..ఈ  వస్తువుల సేకరణ అనేది ప్రతి ఒక్కరి జీవితం లో ఉంటాయి .. తమకు నచ్చినవి , ఎవరైనా బహుమానంగా ఇచ్చినవి ,లభ్యమైనవి అన్ని ఒక పుస్తకం లో లేదా ఒక బ్యాగులో దాచిపెడుతుంటారు .. చిన్నపుడు వస్తువుల సేకరణ అనేది ఒక అలవాటు లాగా ఉండేది .. అయితే వాటిని మనం పెద్దయ్యాక  చూసుకుంటే  చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది .. ఆ వస్తువులను  చూస్తున్న కొద్దీ మన పాత రోజులే గుర్తుకు వస్తుంటాయి .. అచ్చం అలాంటి సేకరణే ఢిల్లీకి చెందిన ఓ  యువతి చేపట్టింది .. కానీ ఇక్కడే  విచిత్రమైన విషయం  ఏంటంటే  .. ఆ యువతి సేకరించింది వస్తువులు  కాదు దోమలు .. మీరు విన్నది నిజమే .. ఆమె అందరికంటే వినూత్నంగా దోమలను సేకరించింది .. మరి ఆ కథేంటో  చూద్దామా ..

ఢిల్లీ కి చెందిన శ్రేయా అనే 12 ఏళ్ల బాలిక వినూత్న పనికి శ్రీకారం చుట్టింది..  ఆమె ఇప్పటికే  అందమైన పెయింటింగ్స్‌తో  సోషల్ మీడియాలో మంచి పేరు సంపాదించగా .. ఇటీవల  ట్వీట్ చేసిన ఓ పోస్ట్‌ అంతకుమించి పేరు సంపాదిస్తుంది ... ..
ఆమె ట్విట్టర్ లో ఓ పుస్తకాన్ని ఫోటో తీసి పెట్టింది .. అయితే ఆ పుస్తకాన్ని జాగ్రత్తగా చూస్తే అందులో చనిపోయిన దోమలు వరుసగా అతికించి ఉంటాయి .. ఈ ఫోటో చూసి షాక్ అయినా నెటిజన్లు ఇదేమి కలెక్షన్ అంటూ ఆశ్చర్యపోతున్నారు ..  ఆ   ఫోటో ని ట్విట్టర్ లో షేర్ చేయగా కొన్ని గంటల్లోనే తెగ వైరల్ అయ్యింది .. అంతేకాకుండా గంటల వ్యవధిలోనే షేర్లు మరియు  కామెంట్లు వచ్చి చేరాయి

ప్రతి ఒక్కరి ఇంట్లో దోమల బెడద అనేది వేధించే సమస్య  .. దోమలు కుట్టడం వల్ల కూడా అనేక వ్యాధులు వస్తుంటాయి .. అయితే యువతి ఒకసారి డెంగ్యూ జ్వరం వచ్చింది.. ఆ జ్వరం వల్ల  తాను నరకయాతనని అనుభవించింది .. ఇక అప్పటినుండి  దోమల నుండి తప్పించుకోవాలంటే వాటిని  చంపడమే  మార్గమని తలిచి  కొన్ని సంవత్సరాల నుండి దోమలను చంపుతూ  వస్తుంది ..  దోమలను  చేతులతో కొట్టి చంపేస్తోంది. అంతేకాదు.. చంపిన దోమలను సేకరిస్తోంది. రోజుకు ఎన్ని  దోమలను చంపానో గుర్తు చేసుకొని చంపినా దోమలను పుస్తకంలో అతికిస్తుంది ..

శ్రేయ  ఇలా దోమలను చంపి సేకరిస్తున్న విషయం తన ఇంట్లో వారికీ తెలియకపోవడం విశేషం  .. కానీ, 2020 అక్టోబర్ నెలలో ఈ విషయం అందరికి తెలిసింది. ఆలా చంపినా దోమలను సేకరిస్తూ వినూత్న పనిని మొదలుపెట్టిన శ్రేయ కి నెటిజన్ల నుండి ప్రశంసలు  వెల్లువెత్తుతున్నాయి .. దోమలను సేకరించే గొప్ప పనికి పూనుకున్న శ్రేయా ఇప్పుడు బాగా  ఫేమస్ అయిపోయింది.  .









మరింత సమాచారం తెలుసుకోండి: